తెలంగాణలో గ్రహాంతరవాసి అనే పదం కలకలం రేపుతోంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తెలంగాణలో పర్యటిస్తున్నారు. మొత్తం మీద 5,400 కోట్ల రూపాయలతో చేపట్టే 26 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆయన్ని ఢిల్లీ మీడియాలో ముద్దుగా గ్రహాంతరవాసి అని పిలుచుకుంటారు. ఎందుకంటే మానవ మాత్రుడు చేయలేని పనుల్ని లక్ష్యంగా పెట్టుకుని.. వాటిని పూర్తి చేయడం ఆయన గొప్పతనం.
………..
ఆధునిక పరిపాలనలో నితిన్ గడ్కరీ చెరగని ముద్ర వేశారు.
భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు రోడ్లు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన రికార్డ్ ఆయనకు ఉంది. ఇది అంత తేలిగ్గా వచ్చిపడిన రికార్డు కాదు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను… నభూతో,, న భవిష్యతి… అన్న తరహాలో ఆయన తీర్చిదిద్దారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా స్థలం చూపిస్తే చాలు – నేను రోడ్డు వేసేస్తా అంటూ ఆయన చాలెంజ్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రోడ్లను నిర్మించిన రెండో దేశంగా భారత్ కు రికార్డు సంపాదించారు. దేశంలోని ప్రతి జిల్లా లోనూ జాతీయ రహదారి మార్కు ఉండేలా నితిన్ గడ్కరి రికార్డు సృష్టించారు.
………
ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రైవేటు రంగానికి కాత్ర కల్పించి అభివృద్ధిని సాకారం చేయడం గడ్కరీ గొప్పతనం. అలాగని కోటీశ్వరుల కుటుంబంలో ఆయన ఏమీ పుట్టలేదు.
మహారాష్ట్రలోని నాగపూర్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో నితిన్ గడ్కరీ జన్మించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ లో చేరాక ఆయన జీవితం మారిపోయింది. అనంతరం బిజెపిలో ప్రవేశించి,, మహారాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. అప్పట్లోనే ముంబై పూనే ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దేశంలో రోడ్లు ఎలా నిర్మించాలో తెలియచెప్తూ ఆయన ఒక రిపోర్ట్ తయారు చేశారు. దాని ఆధారంగా పుట్టుకొచ్చిన పథకమే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన.
…….
రోడ్లు, వంతెనలు అద్భుతంగా ఏర్పడితే ఆర్థిక వ్యవస్థ ఊపందు కుంటుంది అనేది నితిన్ గడ్కరీ విజన్. అందుచేతనే .. స్వాతంత్రం తర్వాత గత 70 సంవత్సరాలలో ఎన్ని రోడ్లు వేశారో,, కేవలం ఈ 10 ఏళ్లలోనే అన్ని రోడ్లను అద్భుతంగా నిర్మించి శభాష్ అనిపించుకున్నారు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ నాణ్యమైన రోడ్లను భారతదేశానికి అందించారు. అందుచేతనే ఫ్లై ఓవర్ మినిస్టర్ ,,, ఎక్స్ ప్రెస్ వే మినిస్టర్ అని ఆయన్ని ముద్దుగా పిలుస్తారు.
………..
ఇక ఢిల్లీలోని జాతీయ మీడియా నితిన్ గడ్కరీ ని గ్రహాంతరవాసి అని పిలుస్తుంది. నిశ్శబ్దంగా అద్భుతమైన పనులు చేయడం గడ్కరీకి అలవాటు. నాగపూర్ లో చిన్న బైక్ మీద తిరుగుతూ పనుల్ని చక్కపెట్టుకుంటూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నెలకొని ఉన్న నాగపూర్ కి చాలా కాలం నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. నాగపూర్ అంతట అద్భుతమైన రోడ్ల నిర్మించి శభాష్ అనిపించుకున్నారు. ఆయన వేసిన రోడ్లమీద ఖరీదైన వాహనాలు చకచకా తిరుగుతుంటే ఆయన మాత్రం చిన్న బైక్ వేసుకుని రోడ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా వేల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. అందుచేతనే ఆయన్ని గ్రహాంతరవాసి అని పిలుస్తుంటారు.