భారత దేశం ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకొని వెళుతోంది. ప్రపంచ దేశాలు అబ్బురపడి చూసే విధంగా వివిధ రంగాలలో ప్రగతనిని సాధిస్తున్నది. ఈ అభివృద్ధికి ప్రధాన వేదికగా ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) నిలుస్తుంది. ఇస్రో ఇప్పటికే ప్రపంచంలోనే అతి తక్కువ వ్యయంతో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న సంస్థగా గుర్తింపు పొందింది.
ఒకప్పుడు అంతరిక్ష పరిశోధనలను అబ్బురంగా చూసే పరిస్థితి ఉండేది. అమెరికా, రష్యాలదే ఆధిపత్యంగా ఉండేది. ఆ టెక్నాలజీ ని మనకు కాస్త ఇచ్చేందుకు కూడా బయట నిలబెట్టేవారు కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాలకు పెద్ద పీట వేస్తోంది. దీంతో అమెరికా అంతరిక్స పరిశోధన సంస్థ నాసా కూడా భారతదేశానికి వచ్చి, ఇక్కడ నుంచే ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించుకొంటోంది. ఆ క్రమంలనే నిసార్ ఒక మైలు రాయిగా నిలుస్తోంది.
నాసా – ఇస్రో సంయుక్తంగా నిర్మించిన నిసార్ ఉపగ్రహం
నిసార్ ఉపగ్రహం అనేది భూమిపై జరిగే సహజ మార్పులపై గమనించేందుకు రూపొందించబడిన ఒక అత్యంత ఆధునిక ఉపగ్రహం. ఇది భూమి చుట్టూ తిరుగుతూ భూకంపాలు, హిమగిరుల కరుగుదల, అటవీ మార్పులు, వరదలు, భూచలనం లాంటి మార్పులను ఖచ్చితంగా గుర్తించగలదు.
నిసార్ ప్రత్యేకతలు:
ఇది ఎల్-బ్యాండ్ (నాసా) మరియు ఎస్-బ్యాండ్ (ఇస్రో) అనే రెండు రేడార్ వ్యవస్థలతో పనిచేస్తుంది.
ప్రపంచంలోనే తొలిసారిగా ఈ రెండు రకాలను కలిపిన ఉపగ్రహం ఇదే.
ఇది 2025 జూలై 30న శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్నారు.
ఇది భూమిని ప్రతి 12 రోజులకు ఒకసారి పూర్తిగా స్కాన్ చేస్తుంది.
సుమారు ₹788 కోట్లకు పైగా ఖర్చు భారతదేశం పెట్టింది.
ప్రయోజనాలు:
ప్రకృతి విపత్తులపై ముందస్తు సమాచారం
సాగు భూములపై అధ్యయనం
సముద్ర తీరాల మార్పులపై గమనిక
హిమగిరుల కరిగిపోతున్న స్థితిపై వివరాలు
గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పరిశీలన
భారత ప్రభుత్వం – మోదీ నాయకత్వంలో సైన్స్ మరియు టెక్నాలజీకి ఊతం
2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి హోదాలో అధికారంలోకి వచ్చాక దేశ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక రంగానికి విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా మూడు కీలక రంగాలకు ప్రోత్సాహం లభించింది:
అంతరిక్ష పరిశోధన
ప్రైవేట్ రంగ సంస్థలకు అవకాశం
సైన్స్ విద్యలో యువత ప్రోత్సాహం
మోదీ పాలనలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొన్నారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఇన్‌స్పేస్ అనే సంస్థ ఏర్పాటు చేసి ప్రైవేట్ రంగ సంస్థలకు ఉపగ్రహాలు, ప్రయోగాలపై అనుమతి.
గగనయాన్ ప్రాజెక్టు ద్వారా మానవులను అంతరిక్షంలోకి పంపించేందుకు ప్రణాళిక.
చంద్రయాన్-3, అడిత్య ఎల్-1, ఎక్స్‌పోశాట్ వంటి అద్భుతమైన ప్రయోగాల విజయాలు.
అమెరికా, జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలతో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు.
భారత అంతరిక్ష రంగంలో మోదీ పాలనలో విజయవంతం అయిన ప్రయోగాలను ఇప్పుడు చూద్దాం.
1. చంద్రయాన్–3 (2023)
జూలై 14, 2023న ఎల్.వీ.ఎం3 రాకెట్ ద్వారా ప్రయోగం.
చంద్రుని దక్షిణ ధ్రువం పై విజయవంతంగా దిగిన తొలి దేశంగా భారతదేశం నిలిచింది.
ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ కీలక పాత్ర పోషించాయి.
ఆగస్టు 23ను “జాతీయ అంతరిక్ష దినోత్సవం”గా ప్రకటించారు.
2. అడిత్య ఎల్–1 (2023)
ఇది సూర్యుని అధ్యయనానికి భారత తొలి అంతరిక్ష పరిశోధనా మిషన్.
సెప్టెంబర్ 2, 2023న ప్రయోగం.
ఇది ఎల్1 లాగ్రాంజియన్ పాయింట్ వద్ద స్థిరంగా ఉండి, సూర్యుని అల్ట్రావయలెట్ కిరణాలు, మాగ్నెటిక్ ఫీల్డ్‌ను పరిశీలిస్తుంది.
3. ఎక్స్‌పోశాట్ (2024)
ఇది ఎక్స్-రే పరిక్షణ కోసం రూపొందించబడిన ఉపగ్రహం.
నక్షత్రాలు, నెబ్యూలా, బ్లాక్ హోల్స్ వంటి ఆకాశీయ వస్తువులపై గమనిక.
జనవరి 1, 2024న ప్రయోగం.
4. ఎస్పాడెక్స్ (2024)
ఇది రెండు ఉపగ్రహాలను కక్ష్యలో డాకింగ్ చేయడం పై ప్రయోగం.
ఈ సాంకేతికత భవిష్యత్తులో స్పేస్ స్టేషన్ల నిర్మాణానికి అవసరం.
భారతదేశం డాకింగ్ సాంకేతికతను కలిగిన నాలుగవ దేశంగా నిలిచింది.
5. ఎన్వీఎస్-01, ఎన్వీఎస్-02 (2023, 2025)
ఇవి నావిక్ (భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ) కు చెందిన ఉపగ్రహాలు.
దేశీయంగా తయారైన అణు గడియారాలు ఇందులో వినియోగించబడ్డాయి.
గగనయాన్ – భారతీయుడి తొలి అంతరిక్ష ప్రయాణం
గగనయాన్ అనేది మానవ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి భారత్ చేపట్టిన ప్రథమ ప్రయత్నం. దీని ముఖ్య లక్ష్యాలు:
మూడు భారతీయ వ్యోమగాములను లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపడం.
ప్రయోగం కోసం ప్రత్యేకంగా హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ తయారీ.
వ్యోమగాములకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయడం.
ప్రయోగానికి ముందు అనేక పరీక్షలు, డమీ క్యాప్సూల్ ప్రయోగాలు నిర్వహించబడ్డాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ అంతరిక్షంలో మానవులను పంపగలిగే స్వయం సమర్థ దేశాల సరసన నిలవబోతోంది.
భవిష్యత్తు ప్రణాళికలు:
చంద్రయాన్–4 ద్వారా చంద్రుని నుంచి మట్టిని తెచ్చే ప్రాజెక్టు
భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు (2035 లక్ష్యం)
పునర్వినియోగించదగిన రాకెట్లు (న్యూ జెనరేషన్ లాంచ్ వెహికల్స్)
వాణిజ్య ప్రయోగాలకు ప్రైవేట్ సంస్థల ప్రోత్సాహం
అంతరిక్ష ఆధారిత వ్యవసాయ డేటా అనలిటిక్స్
భారతానికి అంతర్జాతీయ గుర్తింపు
ఇస్రో నిర్వహించిన వివిధ ప్రయోగాలు అంతర్జాతీయంగా దేశ గౌరవాన్ని పెంచాయి. చంద్రయాన్-3 విజయాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా, జపాన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా తదితర దేశాలు అభినందించాయి. నాసా–ఇస్రో మద్య జరిగిన నిసార్ ఒప్పందం, ఈ రెండు దేశాల సాంకేతిక బంధాన్ని బలపరచింది. ఇది ప్రపంచ స్థాయిలో శాస్త్రపరంగా రెండు పెద్ద దేశాల మధ్య మైన మైలు రాయిగా నిలుస్తోంది.
భవిష్యత్తు ప్రణాళికలు
భారతదేశం ఇకపై కేవలం ప్రయోగాలు చేసే దేశం కాదు. ఇది పరిశోధనలకు, మానవ సహాయక చర్యలకు, వాతావరణ సమాచారానికి, వ్యవసాయానికి, ఆర్థికాభివృద్ధికి అంతరిక్ష శక్తిని వినియోగించుకునే దేశంగా ఎదుగుతోంది. ప్రపంచ దేశాలు ప్రధానంగా అంతరిక్ష పరిశోధనలకు భారత్ వైపు చూసే పరిస్థితి నెలకొంది. అంతిమంగా అగ్ర దేశాలు డబ్బులు చెల్లించి మన టెక్నాలజీ ని వినియోగించుకొనే అడుగులు వేస్తున్నది.
శాస్త్రం ద్వారా శక్తి
నిసార్ ఉపగ్రహ ప్రయోగం ఒక సూచక మాత్రమే కాదు, . ఇది కేవలం ఇస్రో విజయం మాత్రమే కాదు. ఇది భారతదేశం శాస్త్ర విజ్ఞానంపై పెట్టిన నమ్మకానికి ప్రతీక. ఇది మోదీ ప్రభుత్వం దృఢ సంకల్పానికి చిరునామా. ఈ ప్రయోగం ద్వారా ప్రపంచానికి భారత్ ఇవ్వబోతున్న విజ్ఞాన సంపద అపారమైనది. భూమిని గమనించేందుకు అంతరిక్షం నుంచి అవకాశం కలుగుతుంది. త్వరలోనే భారత్ తన టెక్నాలజీ ద్వారా ఈ శతాబ్దాన్ని నడిపించే శక్తిగా ఎదగనుంది. ఈ సంకేతానికి నిసార్ విజయవంతం కావటం ఒక సూచిక గా నిలుస్తుంది.