ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది భారత బాక్సర్ నిఖత్ జరీన్. తెలంగాణకు చెందిన జరీన్… ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జరిగిన ప్రపంచ బోయింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో థాయిలాండ్ బాక్సర్‌ను మట్టికరిపించింది. 5-0 తేడాతో థాయిలాండ్ బాక్సర్‌ని ఓడించి స్వర్ణాన్ని అందుకుంది. తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఒక్క ఫైనల్లోనే కాదు… ప్రతీ బౌట్లోనూ నిఖత్ పట్టుదలగా ఆడింది. గురువారం సాయంత్రం జరిగిన తుది పోరులో 52 కేజీల విభాగంలో థాయిలాండ్‌కు చెందిన జిట్పాంగ్ జుటామస్‌ను ఓడించింది.
మూడు రౌండ్లపాటు జరిగిన ఈ బౌట్లో జరీన్ ఆధిపత్యమే కొనసాగింది. దీంతో జడ్జీలు 30–27, 29–28, 29–28, 30–27, 29–28లతో తెలంగాణ అమ్మాయికి అనుకూలంగా పాయింట్లు ఇచ్చారు. భారత్ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్ జరీన్ రికార్డులకెక్కింది. మేరీకోమ్ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది.
నిఖత్ జరీన్ విజయంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మన బాక్సర్లు మనల్ని గర్వించేలా చేశారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతాకం సాధించిన నిఖత్ జరీన్ కు అభినందనలు కాంస్య పతకాలు సాధించిన మనీష, పర్వీన్ హుడాకు కూడా అభినందనలు” అని ట్వీట్ చేశారు.
https://twitter.com/narendramodi/status/1527338558184312832?s=20&t=CTn_MptcnYYtHdZWkfceeg