నీట్ పరీక్షను రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. సెప్టెంబర్ 12న జరిగిన నీట్ పరీక్ష పేపర్ ముందే లీక్ అయిందంటూ పిటిషన్ వేశారు కొందరు. విచారించిన ద్విసభ్యధర్మాసనం పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.