తీవ్రవాద సంస్థ SFJ, ఇతర ఖలిస్తానీ అనుకూల గ్రూపులు పై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల NIA బృందం కెనడాకు చేరుకుంది.NIA బృందం ఈ నాలుగు రోజుల పర్యటనలో USA, కెనడా, UK, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి వివిధ దేశాల నుంచి ‘సిక్కులు ఫర్ జస్టిస్’ SFJ మరియు ఇతర ఖలిస్థానీ అనుకూల ఉగ్రవాద సంస్థలలైన ‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’, ‘ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్’ మరియు ‘ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్’ గ్రూపులకు నిధులు అందే మార్గాలపైనా కేంద్ర ఏజెన్సీ బృందం దర్యాప్తు చేయనుంది. సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) అనేది పాకిస్తాన్ ISI మద్దతు గల ఖలిస్తానీ అనుకూల సంస్థ, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలలో పాల్గొన్నందుకు భారత ప్రభుత్వం దాన్ని నిషేధించింది.