మావోయిస్టు అగ్ర నేత ఆర్కే ఇంట్లో ఇవాళ కూడా సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు.ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య పద్మ ఉంటున్న ఇంట్లో సోదాలు చేశారు. వెంట తీసుకువచ్చిన పత్రాలపై ఆమెతో సంతకాలు తీసుకున్నారు. విచారణకోసం విజయవాడలోని ఎన్ఐఏ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.అయితే ఎన్ఐఏ తీరును పద్మ ఖండించారు.తామెవరం ఇంట్లోలేని సమయంలో అధికారులు వచ్చి తాళాలు పగులగొట్టి తలుపులు తీశారన్నారు. ఇల్లంతా గాలించి కొన్ని పుస్తకాలు, పెన్ డ్రైవ్ తీసుకెళ్లారని చెప్పారు. తమను అరెస్ట్ చేయలేదు కానీ భయభ్రాంతులకు గురిచేశారని… లాయర్లతో సలహాలు తీసుకుని విచారణకు హాజరవుతారని చెప్పారు.