మహిళా యాంకర్లు ముఖం పూర్తిగా కప్పుకుని కెమెరా ముందుకు రావాలని అఫ్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ పురుష యాంకర్లు మాస్కులు ధరించి నిరసన తెలిపారు. గురువారం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించగా ఆరోజు చాలా తక్కువ మీడియా సంస్థలే అమలు చేశాయి. సోమవారం నుంచి అఫ్ఘన్లోని దాదాపు అన్ని మీడియా సంస్థలూ ఈ ఆదేశాలను పాటిస్తున్నాయి. అయితే తాలిబన్ల ఈ నిర్ణయంపై పలు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ… ఇదే తుది నిర్ణయమని అఫ్ఘాన్ ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది.