ఇస్లాంలోకి మారమని న్యూస్ చానల్ యజమాని బలవంతం చేశాడని…మారితే 25వేల నుంచి లక్ష రూపాయల జీతం పెంచుతానని ఆశ చూపాడంటూ ఓ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మాత్రమే కాదు చానల్లో పనిచేసే అందర్నీ అలాగే బలవంతపెట్టాడని ఫిర్యాదు చేసింది.
దీనికి సంబంధించి ఆ జర్నలిస్టు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో చానల్ ఎండీ షాన్ చౌదరి…తనను ఇస్లాంలోకి మారాలని బలవంతపెట్టాడని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెండు నెలలు గడుస్తున్నాఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, ఎలాంటి చర్యలూ తీసుకోలేదని వాపోయింది. ఢిల్లీలోని ప్రీతి విహార్ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న న్యూస్ యాక్షన్ నెట్ వర్క్ అనే యూట్యూబ్ చానల్లో ఆ యువతి జర్నలిస్టుగా పనిచేస్తోంది. నువ్వు చూస్తే ముస్లిం అమ్మాయిలానే ఉంటావు..ఇస్లాంలోకి వస్తే 25 వేలున్న జీతాన్ని లక్షరూపాయలకు పెంచుతానన్నాడని ఆరోపించింది. తన మాటలు వికారంగా ఉండడంతో వెళ్లడం మానేసానని… రిజైన్ చేసి సెటిల్మెంట్ చేసుకుందామని 45 రోజుల తరువాత వెళ్తే… షాన్ చౌదరి అందరిముందు నానా దుర్భాషాడాడని… చంపేస్తానని బెదిరించాడని యువతి వాపోయింది. అక్కడినుంచి స్నేహితుల సాయంతో ప్రీతివిహార్ పోలీస్ స్టేషన్ కువెళ్లి ఫిర్యాదు చేస్తే…పోలీసులు కేసు నమోదు చేయలేదని వీడియోలో తెలిపింది. తాను ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేసినా ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆమె అంది.
తరువాత బాధితురాలు సామాజిక కార్యకర్త రాజేష్ భాసిన్, ఆస్తాను సంప్రదించారు. సోషల్మీడియా వేదిగ్గా కూడా సమస్య అందరి దృష్టికీ వెళ్లడంతో సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ రికార్డు చేశారు. రెండు నెలల్లో ముగ్గురు IO లను మార్చారు తప్ప ఎలాంటి చర్యా తీసుకోలేదు.
చౌదరికి రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని తెలిసింది. హసన్ పూర్ నుంచి ఎస్పీ టికెట్ పై పోటీ చేయనున్నట్టు సమాచారం. అయితే సమాజ్ వాదీ పార్టీ విడుదల చేసిన జాబితాలో అతని పేరు లేదు. అయితే న్యూస్ యాక్షన్ నెట్ వర్క్ అప్లోడ్ చేసిన కొన్ని వీడియోల్లో షాన్ ను కాబోయే ఎస్పీ అభ్యర్థిగా ప్రచారం చేశారు. అయితే మరే ఇతర పార్టీనుంచో లేక ఇండిపెండెంట్ అభ్యర్థిగానో పోటీ చేసే అవకాశం ఉందనీచెబుతున్నారు.
In a shocking revelation, a female journalist from a Youtube News Channel based in Delhi’s Preet Vihar alleged that the MD of the News Portal ‘Shaan Chaudhary’ forced her to convert Into Islam. #ForcedConversion #Islam #Delhi #PreetVihar #DelhiPolice pic.twitter.com/7CI17VIfNV
— Organiser Weekly (@eOrganiser) January 26, 2022