భారత సరిహద్దుల్లో బాగా చికాకు పెట్టడం చైనాకు అలవాటు. గొంగళి పురుగు మాదిరిగా భూభాగాన్ని కొరికేస్తూ ముందుకు వస్తూ ఉంటుంది. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా.. నరేంద్ర మోదీ సర్కార్ మాత్రం… ఏ మాత్రం ఊరుకోవడం లేదు. సరిహద్దుల్లో చైనాను కట్టడి చేసేందుకు మోడీ ప్రభుత్వం బలమైన వ్యూహాలు అమలు చేస్తోంది. మూడు రకాల వ్యూహాలను త్రిశూల రూపంలో… ఒకే సారి అమలు చేస్తూ చైనాకు చెక్ పెడుతోంది.
భారత్, చైనా సరిహద్దులు చాలావరకు కొండ ప్రాంతాల్లో ఉంటాయి. ఇక్కడ ప్రయాణం అనేది చాలా కష్టమైన విషయం. మామూలు సైనిక వాహనాలు ఈ కొండగుట్టలో ప్రయాణించడం అంత తేలిక కాదు. అందుచేత సైన్యం ఎక్కువగా యుద్ద ట్యాంకుల మీద ఆధారపడుతుంది. ఈ. ట్యాంకుల మీద ఆయుధ సామగ్రి,, సాధన సంపత్తి పెట్టుకుని సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తుంటారు. అవసరం అయినప్పుడు శత్రువు మీద దాడి చేయడానికి ఈ ట్యాంకులు చాలా అవసరం.
అయితే హెవీ వెయిట్ యుద్ధ ట్యాంకులు సైన్యంలో ఉంటాయి. ఎక్కువ బరువు ఉండే ఈ ట్యాంకుల్లో భద్రత ఎక్కువ. కానీ ఈ యుద్ధ ట్యాంకులు కొండ గుట్టల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అలాగే తేలిక పాటి యుద్ధ ట్యాంకులు కూడా ఉన్నాయి కానీ వీటిలో రక్షణ తక్కువగా ఉంటుంది.
అందుచేత సైన్యం అవసరాల కోసం డి ఆర్ డి ఎల్ ప్రత్యేకంగా కసరత్తు చేసింది. ఈ రెండు మోడల్స్ ని సమిశ్రితం చేసి.. కొత్తరకం యుద్ధ ట్యాంకులను రూపొందించింది.
ఈ కొత్త రకం యుద్ధ ట్యాంకులకు జొరావర్ ట్యాంక్ లు అని పేరు పెట్టారు. అంటే ఈ యుద్ధ ట్యాంకులు లైట్ వెయిట్ ట్యాంకుల మాదిరిగా వేగంగా పరుగులు తీయగలవు మరియు హెవీ వెయిట్ ట్యాంకులు మాదిరిగా పూర్తి భద్రత అందించగలుగుతాయి. వీటిని చైనా సరిహద్దుల్లోని లద్ధాఖ్ ప్రాంతంలో ఉపయోగించాలి అని నిర్ణయించారు. అక్కడ ఎత్తయిన పర్వతాలు, విస్తారమైన కొండగుట్టలు ఉంటాయి. ఈ ప్రాంతంలో చక చక కదులుతూ ఉండే యుద్ధ ట్యాంకులు చాలా అవసరము. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని జొరావర్ యుద్ధ ట్యాంకులను రూపొందించారు.
వాస్తవానికి జొరావర్ సింగ్ అనే ఆయన చాలా బలమైన యుద్ధ నాయకుడు. జమ్మూ కాశ్మీర్ మహారాజ్ గులాబ్ సింగ్ దగ్గర శిక్షణ పొంది భారత దేశం తరఫున లద్ధాఖ్ ప్రాంతంలో సేవలు అందించారు. అక్కడ స్థితిగతులు అన్ని ఆయనకు కొట్టిన పిండి. యుద్ధంలో మాన్యువల్స్ రూపొందించడంలో జొరావర్ సిద్ధహస్తులు. అందుచేత లద్ధాఖ్ ప్రాంతంలో మొహరించే యుద్ధ ట్యాంకులకు ఆయన పేరు పెట్టారు.
ఈ కొత్త రకం ట్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తాయి. వీటికి అన్నివైపులా కెమెరాలు అమర్చారు. డ్రోన్ సిస్టంతో ఇంటిగ్రేట్ చేశారు. దీంతో ఈ ట్యాంకు ప్రయాణించే ప్రాంతాలను పూర్తిస్థాయిలో మానిటర్ చేయగలుగుతారు. దీనికి అత్యాధునిక లైట్ వెయిట్ రైఫిల్స్ సమకూర్చారు. వీటి సహాయంతో శత్రువుల మీద వేగంగా విరుచుకు పడవచ్చు.
ఇక రెండో వ్యూ హం.. పరిస్థితులు మెరుగు చేయడం.
లద్ధాఖ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నారు. సరిహద్దు పొడవునా బలమైన రవాణా వ్యవస్థను రూపొందిస్తున్నారు. దీంతో ముఖ్యమైన ఆయుధ సంపత్తిని సైన్యం దగ్గర కు చేర్చేందుకు వీలవుతుంది. ఆ స్టోర్ పాయింట్ల దగ్గర నుంచి సరిహద్దుల్లోకి ట్యాంకర్ల ద్వారా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా బలమైన వ్యూహాలను సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం అమలు చేస్తోంది.
ఇక మూడో వ్యూహంగా సరిహద్దు గ్రామాల లో మౌలిక వసతులు అభివృద్ధి చేయడం. దీని ద్వారా ఆయా గ్రామాలు ఆధునిక టెక్నాలజీని అంది పుచ్చుకోగలుగుతాయి. ఫలితంగా అక్కడ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. అంతేకాకుండా సైనిక సోదరులకు అండగా నిలిచేందుకు వీలవుతుంది.
మొత్తం మీద చైనా సరిహద్దుల్లో భారత సైన్యం అంతకంతకు బలపడుతోంది అని అనుకోవాలి. దీంతో చైనాకు భవిష్యత్తులో బలమైన పంజా విసిరేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా మూడు రకాలైన వ్యూహాలను ఏకకాలంలో అమలు చేస్తూ నరేంద్ర మోడీ సర్కారు మన సరిహద్దుల్ని పటిష్టంగా తీర్చిదిద్దుతోంది.