నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్లు వాయిస్ ఓవర్లతో చేసిన వీడియోలను జతచేస్తూ ట్వీట్టర్ వేదిగ్గా అభినందనలు తెలిపారు. అయితే ప్రధాని మోదీ వారి ట్వీట్లను రీట్వీట్ చేశారు. నూతన పార్లమెంటు భవనానికి సంబంధించిన వీడియోను ప్రధాని మే 26న షేర్ చేసి, ప్రజలు తమ సొంత వాయిస్-ఓవర్‌తో షేర్ చేయాలని కోరిన సంగతి తెలిసిందే.

నూతన పార్లమెంటు భవనం మన ఆశల నూతన గృహమని షారుఖ్ అన్నారు. ఈ దేశ రాజ్యాంగాన్ని బలపరిచేవారి నివాసమని, 140 కోట్ల మంది భారతీయులు ఒకే కుటుంబంగా నిలుస్తారనీ షారుఖ్ వాయిస్ ఇచ్చారు. దేశంలోని ప్రతి మూలకు చెందినవారికి స్థానం కల్పించేస్థాయిలో అది ఉందని అన్నారు. ‘‘నవ భారతానికి నూతన పార్లమెంటు భవనం, అయితే భారత దేశ కీర్తిప్రతిష్ఠల చిరకాల స్వప్నంతో’’ అని దానికి క్యాప్షన్ పెట్టారు. ‘స్వదేశ్’ చిత్రంలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జత చేశారు.షారూఖ్ ఖాన్ ట్వీట్‌ను మోదీ రీట్వీట్ చేస్తూ, చాలా బాగా చెప్పారని ప్రశంసిస్తూ…ఇది సంప్రదాయం, ఆధునికతల మేళవింపు అంటూ #MyParliamentMyPride అనే హ్యాష్‌ట్యాగ్ ను జతచేశారు.
అక్షయ్ కుమార్ కూడా తన ట్వీట్లో పార్లమెంటు నూతన భవనాన్ని చూడటం గర్వకారణమన్నారు. దేశ అభివృద్ధికి విశిష్ట చిహ్నంగా ఇది ఎల్లప్పుడూ నిలవాలని ఆకాంక్షిస్తూ.. #MyParliamentMyPride అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టారు. అక్షయ్ కుమార్ ట్వీట్ నూ మోదీ రీట్వీట్ చేస్తూ ఆ ఆలోచనల్ని బాగా వ్యక్తపరిచారని ప్రశంసించారు. కొత్త పార్లమెంటు భవనం మన ప్రజాస్వామ్యానికి నిజమైన దిక్సూచి అంటూ ఆయన కూడా… అని #MyParliamentMyPride అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టారు.