తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో నూతన మండలాలు ఏర్పాటు చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం గతంలోనే కొత్త మండలాలు ఏర్పాటు అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆయా నూతన మండలాల్లో భవనాల నిర్మాణం వసతుల ఏర్పాటు జరుగుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సోనాలలో కొత్తగా మండల కేంద్రం రూపుదిద్దుకొంది. తాజాగా తహసిల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ సందర్భంగా
అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ సోనాల ప్రజల ఆకాంక్ష మేరకు ఈ కొత్త మండల కేంద్రము ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు . సోనాల ప్రజలకి జిల్లా యంత్రాంగం నుండి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యాలయాల ఏర్పాటుతో ప్రజలకి ఇక్కడే పాలనా సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యాలయాల వల్ల అధికారులు ప్రజలకి దగ్గరగా ఉండి మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది . మండల రెవెన్యూ ఆఫీసుకు సంబంధించి మీసేవ, ధరణి, భూమాత సేవలు , ఎం పి డీ ఓ ఆఫీసు కి సంబంధించి పెన్షన్లు, ఉపాధి హామీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రజలు, అధికారులు,
ప్రజా ప్రతినిదులు అందరు కలిసి మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డిఓ, జెడ్పి సీఈవో, మండల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక యంత్రాంగానికి జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
More Photos :