13 కొత్త రెవెన్యూ జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు సమర్పించాలని పిలుపునిచ్చింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోగా ఆయా జిల్లాల్లో లిఖితపూర్వకంగా ఇవ్వాలని వెల్లడించింది.
తుది నోటిఫికేషన్ తర్వాత, మొత్తం జిల్లాల సంఖ్య 26 కి చేరుకుంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటు సరిహద్దులను తగ్గించడం, మార్పు చేయడం ద్వారా సంబంధిత ఆయా జిల్లాలు, రెవెన్యూ విభాగాల మెరుగైన పరిపాలన సహా అభివృద్ధిని సులభతరం చేయడం ముఖ్య ఉద్దేశం.
ప్రతిపాదిత జిల్లాలు వాటి ప్రధాన కార్యాలయాల వివరాలు ఇవీ…
మన్యం జిల్లా (పార్వతీపురం)
అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు
అనకాపల్లి (అనకాపల్లి)
కాకినాడ (కాకినాడ)
కోనసీమ (అమలాపురం)
ఏలూరు (ఏలూరు)
ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
బాపట్ల (బాపట్ల)
పల్నాడు (నర్సరావుపేట)
నంద్యాల (నంద్యాల)
శ్రీ సత్యసాయి జిల్లా (పుట్టపర్తి)
అన్నమయ్య జిల్లా (రాయచోటి)
శ్రీ బాలాజీ జిల్లా (తిరుపతి)