నలుగురు భారతీయులతో సహా 22 మందితో నేపాల్లోని పర్వతప్రాంతంలో కూలిపోయిన తారా ఎయిర్ విమానం శిథిలాల నుంచి నేపాల్ సైన్యం సోమవారం 14 మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. ఆదివారం ఉదయం 10.00 గంటలకు పోఖ్రా నుంచి బయలుదేరిన వెంటనే విమానం అదృశ్యమైంది. ముస్తాంగ్ జిల్లాలో ప్రతికూల వాతావరణం కారణంగా కూలిపోయిన విమానం గురించి అన్వేషణ కోసం మోహరించిన అన్ని హెలికాప్టర్లను ఆదివారం నిలిపివేశారు, సోమవారం పునఃప్రారంభించారు.
“ఇప్పటి వరకు పద్నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం, మిగిలిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది కానీ మేం విమానం క్రాష్ అయిన సైట్కు బృందాన్ని తీసుకెళ్లగలిగాం. మరే ఇతర విమానాలకూ అవకాశం లేదు’ అని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికార ప్రతినిధి డియో చంద్ర లాల్ కర్న్ తెలిపారు.
https://twitter.com/WIONews/status/1531161866990260224?s=20&t=AKuwtoSDGn5t0ojy9ZnCrg
నివేదికల ప్రకారం, ఆదివారం అదృశ్యమైన తారా ఎయిర్ విమాన శకలాలు ముస్తాంగ్ జిల్లాలోని సనోస్వేర్, థాసాంగ్-2లో లభించాయి. విమానం(టర్బోప్రొప్ ట్విన్ ఓటర్ 9N-AET)లో ముగ్గురు సభ్యుల నేపాలీ సిబ్బంది తోపాటు నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు సహా 13 మంది నేపాలీ ప్రయాణికులు ఉన్నారు. విమాన ప్రమాదంలో మరణించిన భారతీయ కుటుంబాన్ని అశోక్ త్రిపాఠి (54), అతని భార్య వైభవి బాండేకర్-త్రిపాఠి (51) కుమారుడు ధనుష్ త్రిపాఠి (22), కుమార్తె రితికా త్రిపాఠి (18)గా గుర్తించారు. కుటుంబం సెలవులో నేపాల్లో ఉంది. వారు నేపాల్లోని పోఖ్రాలో తమ విమానాన్ని మారారు.
విమానం సిబ్బందిలో కెప్టెన్ ప్రభాకర్ ఘిమిరేలే, ఫ్లైట్ ఆపరేటర్ కిస్మి థాపా, సిబ్బంది అర్కా సహా ఉత్సవ్ పోఖరెల్లె ఉన్నారు.
కెనడాకు చెందిన ఈ విమానం పొఖారా నగరం నుంచి సెంట్రల్ నేపాల్లోని ప్రముఖ పర్యాటక పట్టణం జోమ్సోమ్కు వెళుతోంది. విమానంలో కూలిన ప్రదేశానికి చేరుకున్న నేపాల్ పోలీసు ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తమాంగ్ నేతృత్వంలోని బృందం, “కొన్ని ప్రయాణీకుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. పోలీసులు అవశేషాలను సేకరిస్తున్నారు.. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఖాట్మండుకు తరలిస్తున్నాం” అని తెలిపారు.
మృతదేహాలను వెలికితీసేందుకు 15 మంది నేపాలీ ఆర్మీ సైనికులను ఘటనా స్థలానికి సమీపంలో దింపారు. క్రాష్ సైట్ సుమారు 14,500 అడుగుల ఎత్తులో ఉంది, జట్టు 11,000 మీటర్ల ఎత్తులో దిగారు.
నేపాల్ ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఫదీంద్ర మణి పోఖ్రేల్ మాట్లాడుతూ.. “విమానంలో ఉన్న ప్రయాణీకులందరూ ప్రాణాలు కోల్పోయారని మేం అనుమానిస్తున్నాం. మా ప్రాథమిక అంచనా ప్రకారం విమాన ప్రమాదంలో ఎవరూ బయటపడలేదు.. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది” అని తెలిపారు.
https://twitter.com/NaSpokesperson/status/1531091044653142016?s=20&t=bgUzndZUhGoSXxEq8fNf9A