ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా భారత్ తరపున సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2022లో నీరజ్ రజత పతకం సాధించాడు. జావెలిన్ త్రోలో 88.13 మీటర్ల దూరం విసిరి రజతం దక్కించుకున్నాడు. చోప్రా తన తొలి ప్రయత్నాన్ని ఫౌల్ త్రో తో ప్రారంభించాడు. రెండో ప్రయత్నంలో 82.39మీ విసిరి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరాడు. ఇక నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు త్రో చేశాడు. గ్రెనేడియన్ అథ్లెట్ అండర్సన్ పీటర్సన్ 90.54 మీటర్లు త్రో చేయడంతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు.
పారిస్ వేదికగా 2003లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో అంజు బాబీ లాంగ్ జంప్‌లో కాంస్య పతకం గెలుపొందగా.. ఆ తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పతకం గెలిచిన రెండో అథ్లెట్‌గా నీరజ్ చోప్రా నిలిచాడు.