ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, ఆవేదనలు ఎందుకోసం ..?. రేమిడిసివర్… దొరకడం లేదని…!? అంతా ఒక ఆందోళన ఎందుకోసం.!?.. డి ఆర్ డి ఓ వాళ్ళు విడుదల చేసిన మందు ఎప్పుడు వస్తుంది అని!.. ఇప్పుడు వైద్యం కోసం కాదు హాస్పిటల్ లో బెడ్స్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి.
ఈ హా హా కారాలలో ఎంతో మంది చస్తున్నారు.!? ఈ పరిస్థితికి కారణం ఎవరు…? భారత దేశాన్ని నడిపిస్తున్న మెడికల్ మాఫియా …ఇది ఏ రూపంలో ఉందో తెలుసుకోవాలంటే ఇటీవల మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వాలను ఎలా బెదిరిస్తున్నారో ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది……..మెడికల్ అసోసియేషన్ వాళ్లు ఏకంగా కేంద్రాన్ని తిట్టే స్థాయికి వెళ్లారంటే….వాళ్ల వెనుక ఉన్నది ఎవరు…!?
ఒకప్పుడు ముంబైలో ఒక పేరు మోసిన న్యాయమూర్తి ఉండేవాడు. ఆయన పేరు జస్టిస్ హాతి. గొప్ప నిజాయితీపరుడు గా పేరుగాంచిన హాతీ ఎవరూ కొనలేనంత ….. నీతి వంతుడిగా ప్రసిద్ధికెక్కాడు. మందులపై పరిశోధనలు చేయడానికి ఆయన అధ్యక్షతన నాటి భారత ప్రభుత్వం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. బహుళజాతి సంస్థల మందుల్లో అవసరమైనవి ఎన్ని ఉన్నాయి ..అని తెలుసుకోవడానికి ఆయనకు పని పురమాయించింది… ఆయన మొత్తం భారతదేశం తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణం కు తిరిగి ,ఈ దేశంలో ఏ మందులు వాడాలి ..అన్న అంశంపై సమగ్రమైన నివేదిక ఇచ్చారు. ఈ నివేదికపై పార్లమెంట్లో రెండు మూడుసార్లు చర్చ కూడా జరిగింది.. ఆ నివేదిక గల్లంతయింది@
జస్ట్ హాతి మనదేశంలో అన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి కేవలం 117 రకాల ఔషధాలు సరిపోతాయని నివేదిక ఇచ్చారు… కానీ దేశంలో పదిహేనేళ్ల క్రితం స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ పరిశీలన చేసేనాటికి 84 వేల రకాల మందులు మన దేశం యొక్క రోగుల శరీరాన్ని ఆక్రమించాయి.. ఇది 15 ఏళ్ళ క్రితం మాట… మరి ఇప్పుడు…!?
డబ్ల్యు.హెచ్.ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నోసార్లు భారతదేశంలో డెబ్భై రెండు వేలకు పైగా నిషేధిత ఔషధాలను వాడుతున్నారని ,వాటిని తక్షణమే బ్యాన్ చేయాలని చెప్పింది. జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా ఇక్కడ మందుల మార్కెట్ అద్భుతంగా నడుస్తుండడం వల్ల బహుళజాతి సంస్థలు ఈ దేశంలో మందుల అమ్మకాలు మొదలుపెట్టాయి. వాళ్లు ఈ దేశ ఆరోగ్య శాఖ మంత్రులను కొనేశారు. ఏ దేశాలు మందులు తయారుచేసి మనకు పంపిస్తున్నారో వాళ్ల దేశాల్లోనే ఆ మందుల పై నిషేధం ఉంది… ఉదాహరణకు శండోజార్స్.. సీబాగాయగి… స్విస్ దేశాల నుండి తయారయ్యే వస్తున్నాయి కాని వాళ్ళ దేశంలో అవి నిషేధించబడ్డాయి. వాటికి భారతదేశం పెద్ద మార్కెట్.. అమెరికా కంపెనీలు తయారు చేసే chloramphenicol… స్ట్రెప్టోమైసిన్…. కాంబినేషన్లను ప్రపంచంలోని అన్ని దేశాలు నిషేధించాయి.. కానీ భారతదేశం బాగా అమ్మి పెడుతుంది…
అంతేకాదు… తయారీ మార్కెటింగ్ ఇంకా దారుణం… ఐదు పైసలకు తయారయ్యే మాత్రను… రెండు, మూడు రూపాయలకు అమ్ముకుంటున్నారు.. బ్రూఫిన్ తయారీ ఖర్చు కేవలం ఐదు పైసలు… మార్కెట్లో 3 నుంచి 5 రూపాయల వరకు అమ్ముడు పోతుంది. డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ రంగంలో సంపాదిస్తున్న లాభాలు… ఈ దేశంలో పెద్ద మెడికల్ మాఫియాను తయారు చేశాయి. ఈ ఫార్మస్యూటికల్ కంపెనీలు తయారు చేసే విషాన్ని మనం తింటూ, ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు బహుళజాతి కంపెనీలకు ఇస్తున్నాం. మందును సృష్టించినట్లే బ్లాక్ మార్కెట్ నూ సృష్టిస్తున్నారు. వీటి కన్నా గొప్పగా రోగాలను సృష్టిస్తున్నారు. ప్రపంచాన్ని అల్లాడించిన కోవిడ్ కు 8 నెలల్లో ఔషధాన్ని కనుక్కున్న మనం… ఈ దేశంలో కొన్ని కోట్ల మంది షుగర్ బిపి రోగులకు మందు ను కనుక్కోవడం కష్టమా….!?
మనకు తెలియకుండానే మన జీవన విధానాన్ని కృత్రిమం చేసి… దాన్ని డిస్టబ్ చేసి…. రోగాన్ని వాళ్లే అందిస్తారు… వాటికి మందులను వాళ్లే ప్రసాదిస్తారు… మెడికల్ మాఫియా తో కుమ్మక్కయిన మీడియాది… గొప్ప పాత్ర ఉంది. అదోచర్చ.
కరోనా ఇంత విజృంభిస్తున్న సమయంలో ఎక్కడా కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ ని గురించి గానీ …మెడికల్ మాఫియా గురించి గానీ ప్రజలను చైతన్య పరచడం లేదు. ప్రభుత్వాలు ఇంకా చేయడం లేదని…. వాళ్లను బోనుల్లో నిలబెట్టి ప్రజల్ని మరింత ఆందోళన లోకి నెట్టడం… నిజానికి కరోనా విజృంభణ అంతా కార్పొరేట్ మెడికల్ వ్యవస్థ ఉన్న ప్రతీ నగరంలో మనకు కనిపిస్తున్నది. ఢిల్లీ ..ముంబాయి …బెంగళూరు ..హైదరాబాద్… ఈ నగరాల్లోనీ కార్పొరేట్ మెడికల్ వ్యవస్థనే దేశంలోని అన్ని నగరాల ,పట్టణాల ఆస్పత్రులకు కన్న తల్లులు…
మన సాంప్రదాయక మైనటువంటి వంటలను మనకు దూరం చేసి ,విషపదార్థాలను కలిపే ఇంగ్రిడియంట్స్ ను మనకు అందించి ,కొత్త కొత్త రోగాలు సృష్టించి వాళ్లే మందులు కనుక్కుంటారు., వాళ్లే చికిత్సలు చేస్తారు…@
రోగాల సృష్టికర్తలు… వాటిని నివారించే అపర ధన్వంతరులు వాళ్ళే.. తస్మాత్ జాగ్రత్త..
(కరోనా విజృంభన నేపథ్యంలో మెడికల్ మాఫియా. పట్ల చైతన్యం కోసం… ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డా భాస్కర యోగి)