ట్విట్టర్ వేదిగ్గా మదర్సాలను పొగిడిన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రణ్ విజయ్ సింగ్ పై మండిపడ్డారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ ప్రియాంక్ కనూంగో. మదర్సాలు సాధారణ పాఠశాలలవంటివే తప్ప మరేం కాదని… మదర్సాల్లో హిస్టరీ, సివిక్స్, గణితం, సైన్స్, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ బోధిస్తారని సింగ్ అన్నాడు. అందులో చదివే పిల్లలు ఐఏఎస్ లు అవుతున్నారని అరబిక్ పదాలు చూసి ప్రశ్నించవద్దని, వారిని చదవుకోనివ్వండని సింగ్ ట్వీట్ చేశాడు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రియాంక. మదర్సా పేరుతో పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేయడం అంటే బాలల హక్కులను ఉల్లంఘించడమేనని కనూంగో అన్నారు. అనవసర విషయాలను పిల్లలకు నూరిపోసే మదర్సాలను కీర్తించడం సరికాదని సింగ్ కు హితవు పలికారాయన.
అయితే ప్రియాంక్ చేసిన వ్యాఖ్యలను సింగ్ వెంటనే ఖండించారు. “NCPCR చీఫ్ ప్రకటన ప్రకారం, ప్రభుత్వమే మదర్సాను నడుపుతున్నందున ప్రభుత్వాలను విచారించాలి. “నాశనానికి ఒక్క గుడ్లగూబ సరిపోతుంది. కానీ గుడ్లగూబ ప్రతి కొమ్మపై కూర్చుంటుంది, కానీ చెట్టుకు ఏం జరుగుతుంది?” అని ఉర్దూ కవి షౌక్ బహ్రైచిని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ రీట్వీట్ చేశాడు.
मदरसा के नाम पर बच्चों को बुनियादी तालीम से वंचित करना उनके बाल अधिकार हनन है,संविधान के अनुच्छेद 21 ‘क’ की अवहेलना है।
और आप जो कर रहे हैं वो झूठ का महिमामंडन है। https://t.co/jRgmCvDYVS— प्रियंक कानूनगो Priyank Kanoongo (@KanoongoPriyank) May 23, 2022
సింగ్ ఆరోపణలపై కనూంగో ఘాటుగా సమాధానమిచ్చారు. ప్రభుత్వం మదర్సాలను నిర్వహించదని స్పష్టం చేశారు. ఔరంగజేబు రూపొందించిన సిలబస్‌ను అనుసరించే ఇస్లామిక్ మత పాఠశాలల్లో 1.25 కోట్ల మందికి పైగా పిల్లలు బలవంతంగా చదివించారని ఆయన అన్నారు. దీనికి సంబంధించి భారతదేశంలోని మైనారిటీ కమ్యూనిటీలలో చదువుతున్న పిల్లల విద్యను డాక్యుమెంట్ చేస్తూ మార్చి 2021లో NCPCR రూపొందించిన నివేదికను ఆయన పోస్ట్ చేశారు.