‘విజయ్ శ్రాంఖ్లా ఔర్ సంస్కృతీయోం కా మహాసంగం’ గ్రాండ్ ఫినాలే సందర్భంగా 22 భాషల్లో నేషనల్ క్యాడెట్ కోర్ క్యాడెట్లు రూపొందించిన రాష్ట్రీయ ఏక్తా గీత్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.
దేశానికి కీర్తి, పురస్కారాలను తీసుకువచ్చిన అనేక మంది ప్రముఖులను NCC తయారు చేసిందని ఆయన కొనియాడారు.
NCC ఐక్యత, క్రమశిక్షణ, సహనం సహా సౌభ్రాతృత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తుందని, ఈ సద్గుణాలు వారికి చిరస్థాయిగా నిలుస్తాయంటూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ప్రధాని మోదీ వంటి అనేక మంది ఎన్సీసీ కేడట్లేనని గుర్తు చేసారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఎన్సిసి ద్వారా న్యూ ఢిల్లీలో ఈ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రచారం ‘సంస్కృతీయోం కా సంగం ‘తో ముగిసింది, ఇందులో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన NCC క్యాడెట్లు పాల్గొన్నారు.