బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సిద్ధిఖి అపాయింట్ మెంట్ కోరినంతనే సమయం ఇచ్చారు అమిత్ షా. ఇద్దరూ దాదాపు అరగంటసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి మొక్కను బహుకరించారు సిద్ధిఖి.అయితే ఆయన అమిత్‌షాను కలవడంవెనక కారణమేంటనేది తెలియకున్నా మర్యాదపూర్వక భేటీ అనే అంటున్నారు.ఈమధ్య నవాజుద్దీన్ సిద్ధిఖి తరచూ బీజేపీ మంత్రులను కలుస్తున్నారు. ఇటీవలే.. ఐసీసీఆర్ చీఫ్ వినయ్ సహస్రబుద్ధే, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను కూడా కలిసి మాట్లాడారాయన.