పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఆయన తన రాజీనామాను భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపారు. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన కారణంగా ఐదు రాష్ట్రాల అధ్యక్షులను రాజీనామా చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరింది. 2017లో 117 సీట్లకు గానూ 77 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న పంజాబ్ కాంగ్రెస్ పార్టీ.. 2022 ఎన్నికల్లో మాత్రం 18 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. 92 సీట్లు గెలుచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)