పార్టీలో చేరాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత… నవజ్యోత్ సింగ్ సిద్దు పీకేతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు.
“నా పాత మిత్రుడు పీకేను కలవడం అద్భుతంగా ఉంది. పాత వైన్, పాత బంగారం, పాత మిత్రులు ఎప్పటికీ ఉత్తమమైనవే” అని సిద్దు ట్వీట్ చేశారు.
https://twitter.com/sherryontopp/status/1518931927218020352?s=20&t=O5xB4OYXCM1aRPhHA75YLA
పార్టీలో చేరాలన్న కాంగ్రెస్ ఆఫర్ ని తిరస్కరించినట్లు ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్లో ప్రకటించిన కొన్ని గంటల తర్వాత సిద్దు ట్వీట్ వచ్చింది. నూతన సంస్కరణల ద్వారా లోతుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి పార్టీకి నా కంటే మెరుగైన నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరం అని పీకే ట్వీట్ చేశారు.
https://twitter.com/PrashantKishor/status/1518901590056333313?s=20&t=xA8DTe4hJWnPxdFjzXWnOA
ఇటీవల పంజాబ్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కావాలని ఆశించారు సిద్దు. అయితే అప్పటి సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు రాహుల్. నవజ్యోత్ సింగ్ సిద్దును పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సిద్దు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)