Naveena – 29nd Aug 2019 By RJ Udhaya sri
ఋగ్వేదంలో స్త్రీలు ఏ విధంగా ఉండేవారు తెలుసుకుందాము
ఋగ్వేదంలో స్త్రీలు బ్రతికినా విధానం వాళ్ళ చదువులు వివాహం గూర్చి తెలుసుకుందాము
వేదాలలో ఋగ్వేదము అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది .ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.శౌనక మహర్షి ఋగ్వేదంలో 10,580 ఋక్కులున్నట్లు వర్ణించాడు. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋగ్వేదానికి ఐదు శాఖలున్నాయి….1 శాకల, 2 బాష్కల, 3 ఆశ్వలాయన, 4 మాండూక్య, 5 సాంఖ్యాయన.వీటిలో శాకల తప్ప ఇంకేవీ అందుబాటులో లేవు… ఋగ్వేదం రెండు విభాగాలుగా ఉన్నాయి. ఒకటి అష్టకాలు, వాటిలో అధ్యాయాలు, వాటిలో వర్గాలూ ఉంటాయి. రెండవ విభాగం మండలాలుగా విభజింపబడింది. మండలాలలో అనువాకాలూ, వాటిలో సూక్తాలుగా విభజింపబడ్డాయి. మొత్తం 1017 సూక్తాలలో 10,580 ఋక్కులలో 1,53,826 శబ్దాలు, వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన.
Podcast: Play in new window | Download