విశాఖపట్నం కేంద్రంగా చక్కటి సాహిత్య సేవ చేస్తున్న ప్రముఖ రచయిత్రి డాక్టర్ దేవులపల్లి పద్మజ జాతీయస్థాయి పురస్కారానికి ఎంపిక అయ్యారు. తెలుగు, సంస్కృతం భాషలలో విభిన్న ప్రక్రియలలో ఆమె సాహిత్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా సరళమైన తెలుగులో డాక్టర్ పద్మజ చేసే రచనలు అనేకమందిని ఆకట్టుకుంటున్నాయి.
ఈ సాహిత్య కృషిని గుర్తించి వరల్డ్ రైటర్స్ ఫోరం, వరల్డ్ పోయెట్రీ అకాడమీ మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకున్నాయి. విశాఖ పట్నానికి చెందిన సాహితీవేత్త, విద్యావేత్త డాక్టర్ దేవులపల్లి పద్మజ ను తెలుగు భాషా సాహిత్యం- సంస్కృతి సంప్రదాయాలు కొరకు చేసిన నిర్విరామ కృషికి గుర్తింపుగా శ్రీ శ్రీ కళా వేదిక నిర్వాహకులు.. జాతీయ ప్రతిభా పురస్కారం ప్రకటించడం జరిగింది. కళా వేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ స్వయంగా లేఖ రాస్తూ… పురస్కారం స్వీకరించుటకు ఈనెల 21వతేదీ మంగళవారం విజయవాడ కు ఆహ్వానించడం జరిగింది. సాహిత్యంలోని విభిన్న ప్రక్రియల్లో అనేక పుస్తక ఆవిష్కరణ లు చేసిన ద్విభాషా పండితులుగా డాక్టర్ దేవులపల్లి పద్మజకు అభినందనలు తెలిపారు. ఈ సాహితీ వేదిక జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి ప్రత్యేకంగా డాక్టర్ పద్మజకు శుభాకాంక్షలు తెలియజేశారు.