కరోనా బారిన పడిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు భారత ప్రధాని. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్వరగా కోవిడ్ నుంచి కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను అని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల సోనియా నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆమెకు స్వల్పంగా జ్వరం రావడంతో పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ అని నిర్థారణ అయింది. దీంతో సోనియా హోంఐసోలేషన్లో ఉండిపోయారు. ప్రధానితోపాటు స్టాలిన్ సహా పలువురు నాయకులూ సోనియా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు.
https://twitter.com/narendramodi/status/1532317778723885056?s=20&t=FK4FbDTbVErYP3jfVQBpag