మూడు రోజుల యూరప్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. సోమవారం రాత్రి జర్మనీలోని బెర్లిన్‌లో భారత కమ్యూనిటీతో సంభాషించారు,
మోదీ సభలో ప్రసంగిస్తూ, “మినిమం గవర్నమెంట్-మ్యాక్సిమం గవర్నెన్స్” అనే మంత్రాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఎప్పుడైనా సరే ప్రపంచం ఏదైనా సమస్యతో బాధ పడుతుంటే, భారత్ ఆ సమస్యకు పరిష్కారంతో వస్తుందని అన్నారు. ఇదీ నూతన భారత్ అసలైన సత్తా అని చెప్పారు. ప్రజలు చురుగ్గా పనిచేసినప్పుడే దేశం పురోగమిస్తుందని చెప్పారు.
ఇక ఇండో-జర్మన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్‌పై ఉమ్మడి ప్రకటనపై భారతదేశం, జర్మనీలు సంతకం చేశాయి. భారతదేశ విద్యుత్, ఇంధన పునరుద్పాదక శాఖ మంత్రి R.K సింగ్, జర్మనీ ఎకనామిక్ అఫైర్స్ అండ్ క్లైమేట్ చేంజ్ శాఖ మంత్రి రాబర్ట్ హబెక్ ఇరువురూ ఈ ప్రకటనపై వర్చ్యువల్ గా సంతకం చేశారు.
ప్రపంచంలోనే పునరుత్పాదక ఇంధన సామర్థ్య జాబితాలో వేగవంతమైన వృద్ధి రేటుతో ఎనర్జీ ట్రాన్సిషన్ లో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా అవతరించిందని ఈ సందర్భంగా సింగ్ అన్నారు. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ బిడ్లతో ముందుకు వస్తోందని గుర్తుచేశారు. భారతదేశంలో ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయడానికి పోటీ పడవలసిందిగా జర్మన్ పరిశ్రమలను ఆహ్వానించారు.