………………..
ఆంధ్రప్రదేశ్ సీనియర్ మంత్రి నారా లోకేష్ పవర్ ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయాలలో, సమాజ నిర్మాణంలో దేశం ఫస్ట్ అని స్పష్టంగా తేల్చి చెప్పారు. భారత్ ఫస్ట్ అనే నినాదాన్ని తాను తీసు కుంటున్నట్లుగా లోకేష్ వెల్లడించారు.
……..
ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కాన్ క్లేవ్ లో నారా లోకేష్ ప్రసంగించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్న రాధా కృష్ణన్ కు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు అంతా మొదటి ప్రాధాన్యత ఓటు ను … రాధా కృష్ణన్ కే వేస్తారని వెల్లడించారు. వాస్తవానికి ప్రతిపక్ష కూటమి తరపున పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగువారు. అందుచేత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పార్టీలకు అతీతంగా ఓటు వేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. దీని మీద స్పందించిన లోకేష్ … తమ పార్టీ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టి చెప్పారు.
……….
దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం చాలా అవసరం అని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఎటువంటి షరతులు లేకుండా కేంద్రం లోని బీజేపీ కి తాము మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందుచేత భారత్ ఫస్ట్ అన్న నినాదానికే తాము కట్టుబడి ఉన్నాం అని తేల్చి చెప్పారు.