ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగోబా జాతర ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను
అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.
అదిలాబాద్ జిల్లాలోని కెస్లాపూర్ నాగోబా జాతర ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, అదనపు ఎస్పీ కాజల్, టెంపుల్ కమిటి సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 28 వ తేదిన మహా పూజ నాగోబా జాతర మొదలవుతుందని, దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఇతర రాష్ట్రాల నుండి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అన్ని వసతులు ఏర్పాటు చేసి దర్శనం మంచిగా జరిగేటట్లు మౌళిక వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు.
మొదటి సమావేశం నిర్వహిస్తున్నామని, తర్వాత కోఆర్డినేషన్ మీటింగ్ 21 న నిర్వహించడం జరుగుతుందనీ , ఆలోగా ఆయా శాఖల సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ ఆన్నారు.
రోడ్లు , త్రాగునీరు సౌకర్యం , టాయిలెట్స్, అత్యవసర వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందనీ, పోలీస్ బందోబస్తు , తదితర యాక్షన్ ప్లాన్ తయారుచేసి పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
ఎస్పీ మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబా జాతరకు గిరిజనులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు . తెలంగాణలోనే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ , మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, భారికేడ్స్, గట్టి బందోబస్తు, తదితర ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ .. గత ఏడాది లాగే ఈ జాతరను విజయవంతం చేయాలని ఆదేశించారు.