గద్వాల జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో పేదల ఇండ్ల స్థలాల పరిరక్షణ కోసం రిలే నిరాహారదీక్ష చేస్తున్న వారికి డి కె అరుణ మద్దతు తెలిపారు.
- 2400 పేద కుటుంబాలకు న్యాయం చేసే భూమి అది. దాన్ని లాక్కునే హక్కు ఎక్కడిది.
- పేద ప్రజల కోసం కేటాయించిన భూమిలో వేరే అవసరాల కోసం తెచ్చిన జీవోను విరమించుకోవాలి.
- అట్టి భూమిలో ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తే సహించేది లేదు.
- జిల్లాలో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. అక్కడ కళాశాలలు, ఆసుపత్రి, నిర్మాణం చేయవచ్చు.
- పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతాను. అవసరమైతే వాళ్ల కోసం ప్రాణాలైనా ఇస్తాను.
- జిల్లా అధికారులు వెంటనే చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పట్టాలపై చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.