ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయంతీసుకున్నారు. ట్విట్టర్ సొంతం చేసుకున్న వెంటనే 50శాతం ఉద్యోగులను తీసివేసిన ఆయన తాజాగా…తాజాగా…అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. గతంలో 3500మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పగా..ఈ నిర్ణయంతో దాదాపు 5000 మంది ఉద్యోగాలు పోయాయి.అయితే కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. ఈమెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ యాక్సెస్ కోల్పోయాక కానీ తాము ఉద్యోగం కోల్పోయినట్టు వారికి తెలియలేదు.
ఎలన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అమెరికాతో పాటు వివిధ దేశాల్లో పనిచేస్తున్న Content Moderation, Real Estate, Marketing, Engineering విభాగాలతో పాటు ట్విట్టర్లోని ఇతర విభాగాల్లో పనిచేస్తున్నవారు ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగులకే కాదు మేనేజర్లకు కూడా ఉద్యోగాలు పీకేస్తున్నట్లు ఎలన్ మస్క్ కనీస సమాచారం ఇవ్వలేదట. ఉద్యోగులు తమకు అఫిషియల్ ఈమెయిల్ ఐడీ యాక్సెస్ అవ్వడం లేదని మేనేజర్లకు చెప్పిన సందర్భంలోనే తమ టీంలోని ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయినట్లు మేనేజర్లకు తెలిసిందట.
“Reprioritization and Savings Exercise”లో భాగంగా ఉద్యోగాల నుంచి మిమ్మల్ని తొలగించామని, నవంబర్ 14 మీ చివరి వర్కింగ్ డే అని సదరు కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ పంపారు మస్క్
మస్క్ ట్విట్టర్ ను చేతిలోకి తీసుకున్నదగ్గర్నుంచే అన్ని స్థాయుల్లోనూ తమ ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందోనన్న ఆందోళన మొదలైంది. గత వారం మస్క్ 50 శాతం మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించడంతో ఈ చర్యను నిరసిస్తూ ట్విట్టర్లో పనిచేస్తున్న కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్స్ స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేశారు. తాజాగా ఈ నిర్ణయంతో మరోసారి అందరికీ షాకిచ్చారు మస్క్.