బాలీవుడ్ డిస్కో కింగ్, ప్రముఖ సంగీత స్వరకర్త బప్పీ లహిరి కన్నుమూశారు. 69ఏళ్ల ఆయన…కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1952లో పశ్చిమ బెంగాల్ లో జన్మించిన బప్పీలహరి అసలుపేరు అలోకేశ్ లహిరి. భారతీయ సినిమా ద్వారా సింథసైజ్డ్ డిస్కో మ్యూజిక్ ను పరిచయం చేసి, ప్రాచుర్యం కల్పించింది ఆయనే.
1980-90 మధ్య కాలంలో బాలీవుడ్ లో అనేక సినిమాలకు బ్లాక్‌బస్టర్ ట్రాక్‌లను అందించాడు. లహిరి స్వయంగా చాలా పాటలు కూడా పాడారు. హిందీ సినిమాలకే కాదు తెలుగు, తమిళ్, బెంగాలీ, కన్నడ, గుజరాతీ సహా ఇతర భాషా సినిమాలకూ పనిచేశారు.
బప్పీలహరి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)