మునావర్ ఫారూఖి షోను రద్దు చేయాలని తెలంగాణలోని హైందవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందువుల పురాణాలపై వెకిలి కామెంట్లు చేసే మునావర్ ను స్వయంగా ప్రభుత్వమే పిలిచి షో పెట్టించడం దుర్మార్గమని హిందూ జనశక్తి అధ్యక్షుడు లలిత్ కుమార్ అన్నారు. జనవరి 9 న నిర్వహించ తలపెట్టిన మునావర్ షోను రద్దు చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. హైందవ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో లలిత్ కుమార్ నేతృత్వంలో డీజీపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.