దేశ ఆర్ధిక రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కరోనా బాధితులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే.. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 23 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్‌ను కరోనా ఆస్పత్రిగా ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 76 మందికి పైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. పది మంది కరోనా బాధితులు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున భాండూప్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో దట్టమైన పొగలు ఆస్పత్రి ఆవరణను చుట్టేశాయి. దీంతో రోగులు శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రిలోని బాధితులందర్నీ ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Maharashtra: Fire breaks out at a hospital in Mumbai's Bhandup; rescue operation on
"Cause of fire is yet to be ascertained. I've seen a hospital at mall for the first time. Action to be taken. 70 patients including COVID infected shifted to another hospital," says Mumbai Mayor pic.twitter.com/sq1K29PVhe
— ANI (@ANI) March 25, 2021