ఆసియాలోనే కుబేరుడిగా తన స్థానాన్నిమరోసారి సుస్థిరం చేసుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ. ఆదానీ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ ఆదానీ కన్నా అధికసంపన్నుడిగా ముందు నిలిచారు. అయితే ఇద్దరి సంపదలో తేడా కేవలం 1 బిలియన్ డాలర్లు మాత్రమే. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జూన్ 3నాటికి ముఖేశ్ అంబానీ సంపద విలువ 99.7 బిలియన్ డాలర్లు కాగా అదానీ సంపద విలువ 98.7 బిలియన్ డాలర్లు. అంటే అంబానీ సంపద అదానీ సంపద కన్నా 1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 7,700వేల కోట్లు ఎక్కువ అన్నమాట.
ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేశ్ అంబానీ ఎనిమిదో స్థానంలో, గౌతమ్ అదానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు.
ఆయిల్ రిఫైనింగ్ మార్జిన్స్, టెలికాం, డిజిటల్ సర్వీసెస్, రిటెయిల్ బిజినెస్ లలో అత్యధిక లాభాలు రావడంతో అంబానీ ఆస్తులు పెరిగాయి. ఇక బిలియనీర్ల నికర సంపద విలువను పరిశీలించే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గడచిన 24 గంటల్లో ఆస్తుల విలువలను పరిశీలించింది. అంబానీ ఆస్తి విలువ 24 గంటల్లో 3.59 బిలియన్ డాలర్లు పెరగగా, అదానీ సంపద విలువ 2.96 బిలియన్ డాలర్లు పెరిగిందని వెల్లడైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ల విలువ పెరగడం కొనసాగడంతో అంబానీ సంపద పెరిగింది.