ఎస్సీ వర్గీకరణకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద తెలంగాణ సమాజంలో హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఎమ్మార్పీఎస్ పోరాటం ఈనాటిది కానే కాదు. మూడు దశాబ్దాలుగా ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకంజ వేయకుండా పోరాటం చేస్తూ ఎంఆర్పిఎస్ ముందుకు సాగింది. రాజకీయ ఒత్తిళ్లు, నాయకుల బెదిరింపులు, న్యాయపరమైన వివాదాల్ని దాటుకుంటూ సుప్రీంకోర్టు ముంగిట నిలవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్థిస్తూ మందకృష్ణ మాదిగ చూపిన చొరవను బిజెపి నాయకత్వం ఆమోదించింది. ఎమ్మార్పీఎస్ పోరాటానికి మద్దతు ఇవ్వడంతో పాటుగా సుప్రీంకోర్టులో స్వయంగా కేంద్ర ప్రభుత్వము అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఎంఆర్పిఎస్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు విలువరించింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కలెక్టర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో.. సంబరాలు నిర్వహించారు . ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆరేల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ..
ఎస్సీ వర్గీకరణ కు అడ్డంకులు తొలగిపోయాయి అని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 1994 నుండి 2024 నేటి వరకు ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పోరాటం సాగిస్తూ వచ్చారని గుర్తు చేశారు.
ఈ విజయం 30 ఏళ్లపాటు పోరాటం చేసిన ఉద్యమకారులకు అంకితం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ సంబరాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంబ్లె ఉద్ధవ్, జిల్లా సీనియర్ నాయకులు ఇండ్ల ఎల్లన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గైక్వాడ్ సూర్యకాంత్ మాదిగ, మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు పసుల శ్రీకాంత్ మాదిగ, డీకే నాందేవ్ సార్, పసుల వేణు మాదిగ, సచిన్, శ్రీహరి, జగన్ జాదవ్ శేఖర్, మాదిగ ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.