మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యం గురించే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దాని వెనక ఉగ్రకుట్ర ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధాని నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా మృత్యుంజయ హోమాలు నిర్వహించారు. పార్టీ చీఫ్ బండి సంజయ్ సూచనతో జిల్లా, మండల స్థాయిలో హోమాలు చేశారు. హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరీ మఠం ఆలయంలో నిర్వహించిన మృత్యుంజయ హోమంలో బండి సంజయ్, డా. కె.లక్ష్మణ్ సహా పలువురు పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు.
బోథ్ మండలం లోని సోనాల గ్రామం రామాలయంలో మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సోనాల గ్రామ రామాలయం లో మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో OBC మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ గొర్ల రాజు యాదవ్ గారు బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ సుభాష్ సూర్య గారు రైల్వే బోర్డ్ సభ్యులు శ్రీ GV రమణ గారు మండల జనరల్ సెక్రెటరీ తుకారం గారు BJYM జిల్లా కార్యదర్శి రంజీత్ గారు, OBC మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్ సోలంకి గారు పాల్గొనడం జరిగింది.
Bandi Sanjay Mruthyunjaya Homam watch Video Here :-