ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతోంది. బలమైన దేశాల నాయకులు స్వయంగా న్యూఢిల్లీకి వచ్చి మోదీని కలుసుకోవడం ఇందుకు స్పష్టమైన నిదర్శనం. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్…. స్వయంగా భారత్‌కు వచ్చి ప్రధాని మోదీతో భేటీ కావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
………………………………………
భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాల నేతలు ముందుకు వస్తున్నారు. సంపన్న దేశాల్లో ఒకటైన యూఏఈ అధ్యక్షుడు ప్రత్యేకంగా న్యూఢిల్లీకి రావడం మామూలు విషయం కాదు. ప్రధాని మోదీతో ప్రత్యేక సమావేశం జరపడం మోదీ నాయకత్వానికి ఉన్న అంతర్జాతీయ గుర్తింపును చూపిస్తోంది.
………………………..
నరేంద్రమోదీ విదేశాంగ విధానం ఇప్పుడు ఫలితాలు ఇస్తోంది. భారత్‌ను విశ్వసనీయ దేశంగా, స్థిరమైన భాగస్వామిగా ప్రపంచం చూస్తోంది. అందుకే బలమైన దేశాల అధ్యక్షులు, ప్రధానులు మోదీని కలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది కేవలం ఒక భేటీ కాదు… ప్రపంచ దేశాల్లో భారత్‌కు పెరుగుతున్న గౌరవానికి ప్రతీకగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
…………………………………………………………..
ఇదే తరహాలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక శక్తివంతమైన దేశాల నాయకులు ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ ఆల్బనీజ్ వంటి నేతలు గతంలో కలిసి వెళ్లారు. అంతేకాదు, ప్రధాని నరేంద్రమోదీకి ప్రపంచ దేశాల నుంచి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించడం కూడా ఆయనకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపుకు నిదర్శనం. యూఏఈ నుంచి ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’, సౌదీ అరేబియా నుంచి ‘ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్’, ఫ్రాన్స్ నుంచి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్’, అమెరికా నుంచి ‘లీజియన్ ఆఫ్ మెరిట్’, వంటి అవార్డులు వరించాయి. అలాగే రష్యా, ఈజిప్ట్, భూటాన్ వంటి దేశాల నుంచి వచ్చిన అత్యున్నత గౌరవాలు మోదీ ప్రతిష్టను మరింత పెంచాయి.
……………………………………………………………………………….
వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, ఇంధనం వంటి కీలక రంగాల్లో భారత్‌తో కలిసి ముందుకు సాగాలని యూఏఈ వంటి దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీతో జరిగిన భేటీ ఇరు దేశాల సంబంధాలను మరింత బలపరుస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే, ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచ రాజకీయాల్లో భారత్ చక్రాన్ని తిప్పుతున్నారు. ఒకప్పుడు భారత్ వెళ్లి కలిసే దేశాల నేతలు… ఇప్పుడు మోదీని కలుసుకోవడానికి న్యూఢిల్లీకి వస్తున్నారు. ఇది కొత్త భారతానికి వచ్చిన గుర్తింపు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.



