శ్రీరామ రథ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ నగేష్. ఆధ్యాత్మిక వాతావరణంలోకి సోనాల గ్రామం.
బోథ్ మండలములోని సోనాల గ్రామంలోని రామాలయంలో ప్రతి ఏడాది దసరా నవరాత్రులను పురస్కరించుకొని 9 రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది .
గత పది సంవత్సరాల నుండి నిర్విరామంగా భక్తి శ్రద్ధలతో సాగుతుంది.
ఇటీవల రామాలయ కమిటీ తీర్మానం మేరకు,
సీతారామ, లక్ష్మణ ,ఆంజనేయ స్వాములకు శోభాయాత్రకు వీలుగా శ్రీరామరథమును తయారు చేయడం జరిగింది.
ఈరోజు ఈ శ్రీరామరథానికి శాస్త్రోక్తంగా యజ్ఞం, పూజా,పూర్ణహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది .
ఇట్టి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు
శ్రీ గోడం నగేష్ విచ్చేసి శ్రీరామ రథానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వారు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ,
సోనాల రామాలయం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరుగా నిలుస్తుంది అన్నారు.
బ్రహ్మోత్సవాల నిర్వహణ ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక ,భక్తి భావనలను పెంపొందిస్తున్నారన్నారు .
తొమ్మిది రోజులపాటు గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ చైర్మన్ జివి రమణ,
మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్,
మాజీ సర్పంచ్ చెట్ల పెళ్లి సదానందం మరియు కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.