ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. ఈ వ్యవహారంపై మీడియాతో ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్ కాదని.. ఫేక్ అని చెప్పారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని, వీడియోని మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని ఎస్పీ మీడియాకు వెల్లడించారు. మొట్ట మొదటగా ITDP official అనే వాట్సాప్ గ్రూపులో ఈనెల 4న అర్ధరాత్రి 02:07 am గంటలకు +447443703968 నంబర్ నుంచి వీడియోను పోస్ట్ చేసినట్లు తేలిందని తెలిపారు. ఈ వీడియో పోస్ట్ చేసే కొన్ని క్షణాల ముందు iTDP official అనే వాట్సాప్ గ్రూపులో నంబర్(+447443703968) ను యాడ్ చేశారనన్నారు. సదరు నెంబరు యూకే వొడాఫోన్కు సంబంధించినదిగా గుర్తించామని ప్రకటించారు. సదరు వీడియోను వేరే మొబైల్ ద్వారా చిత్రీకరించారని, ఒరిజనల్ వీడియో దొరికే దాకా ఏమీ చెప్పలేమని ఎస్పీ తెలిపారు.