ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించి నిన్న ఉదయం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ వీడియోలో హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ పూర్తిగా నగ్నంగా కనిపించారు. మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. దీంతో ఇది జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.
దీనిపై ఆయన స్పందిస్తూ.. తనను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని మాధవ్ మండిపడ్డారు. ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ వీడియోలో తాను ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారని.. ఏ విచారణకైనా, ఫోరెన్సిక్ టెస్టుకైనా సిద్ధమన్నారు. ఆ వీడియో నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ ఉన్నారన్నారు. ఇప్పటికే ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎంపీ తెలిపారు.
ఈ విషయంలో నిజంగా ఆయన తప్పు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మా పార్టీ మహిళల పక్షపాత పార్టీ. నిజంగా తప్పు ఉంటే సీఎం ఊరుకోరు. టీడీపీ ఈ విషయమై రాద్దాంతం చేస్తోంది. కానీ మా నాయకుడు చేతల్లో చూపిస్తారు. గోరంట్ల మాధవ్ దీనిపై పోలీస్ కేసు పెట్టారు. వాస్తవాలు తెలియాల్సి ఉంది. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.