సినిమాల ప్రభావం పౌరుల వ్యక్తిగత జీవితాలపైనా పడుతుంది. కొన్ని సినిమాలు, అందులోని పాత్రలు కొందరి జీవితాల్ని మార్చేస్తాయి. ఇక బాలీవుడ్ సినిమాల ప్రభావం కూడా మనుషులపై చాలా ఉంటుంది. అదే పనిగా దేశ సంస్కృతి, సంప్రదాయాలను టార్గెట్ చేస్తూ చరిత్రను వక్రీకరిస్తూ సినిమాలు తీస్తున్న ఘనులు దేశమంతటా ఉన్నారు. కావాలని రెండు మతాల మధ్య విద్వేషాలు పెంచేలా సినిమాలు తీస్తుంటారు. అలాంటి వక్రీకరించిన కథనమే హైదర్ సినిమా. ముస్లింలను శాశ్వత బాధితులుగా చూపించిన విజయవంతంమైన సినిమా అది. వివాదాస్పద దర్శకుడు విశాల్ భరద్వాజ్ దానికి దర్శకత్వం వహించాడు.
అయితే అందులో నటించిన ఓ యువకుడు తరువాత ఉగ్రవాద సంస్థలో చేరాడని మీకు తెలుసా. అంతేకాదు ఆ తరువాత ఎన్ కౌంటర్లో హతమయ్యాడు కూడా. అయితే అతన్ని ఓ మానవతామూర్తిగా, త్యాగిగా, సింహంతో పోలుస్తూ అభివర్ణించాయి ది వైర్ వంటి మీడియా సంస్థలు, సోకాల్డు లిబరల్స్.
పేరుమోసిన భారత వ్యతిరేక ప్రచారకుడు , పాకిస్తానీ-అమెరికన్ బషరత్ పీర్ రూపొందించిన ‘హైదర్’ చిత్రం, కశ్మీర్ పట్ల ఏకపక్ష దృక్పథాన్ని చిత్రించారు అందులో. అయితే ఆ సినిమాలో నటించిన యువకుడు కొంత కాలానికే భారత్ పై యుద్ధం ప్రకటిస్తూ పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలో చేరిపోయాడు. “హైదర్”లో చూపించిన సాకిబ్ బిలాల్ షేక్ అనే కాశ్మీరీ యువకుడు నిజ జీవితంలో ఉగ్రవాదిగా మారాడు.
సినిమాలో నటించిన ఐదేళ్లకు 2018 డిసెంబర్లో సాకిబ్ షేక్ ను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. అదే ఏడాది ఆగస్టులో తన స్నేహితుడు ముదాసిర్ రషీద్ తో కలిసి అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటూ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్‌లో హతమయ్యాడు. మాంసం కోసం మార్కెట్ కి వెళ్లిన యువకుడు తిరిగి రాలేదని తల్లిదండ్రులు అంతకు ముందు ఫిర్యాదు చేశారు.
ఉగ్రసంస్థలో చేరిన తరువాత సాకిబ్ పలుమార్లు గ్రామానికి వచ్చినట్టు స్థానికులు తెలిపారు. అయితే స్నేహితులను మాత్రమే కలిసి వెళ్లేవాడు తప్ప కుటుంబ సభ్యులను కలసేవాడు కాదు. అలా ఉగ్రసంస్థలో చేరిన యువకుడిని వామపక్ష మీడియా నిరపరాధి అని తేల్చేసింది.
సాకిబ్ షేక్ , అతని స్నేహితుడు ముదాసిర్ పర్రే హతమైన మరునాడు ది వైర్ హడావుడి చేసింది. సెక్యులర్-లిబరల్ ఎకో సిస్టమ్ ఏకపక్షంగా వాళ్ల వైపు నిలిచి నిస్సిగ్గుగా సమర్థించాయి. ఒకరు ఫుట్ బాల్ ప్లేయర్ అయితే మరొకరు థియేటర్ ఆర్టిస్ట్ అంటూ నమ్మబలికింది. ఫుట్ బాల్ ప్లేయర్ కూడా అయిన సాకిబ్ తెలివైన విద్యార్థి అని, పదోతరగతిలో 76 శాతం మార్కులు సాధించాడని…ఇంజినీర్ కావాలనుకున్నాడని.. అదే సమయంలో విశాల్ భరద్వాజ్ సినిమా హైదర్ లో గెస్ట్ రోల్ లో కనిపించాడంటూ రాసుకొచ్చింది వైర్ తోపాటు ఓ వర్గం మీడియా. కొన్ని పరిస్థితుల్లో ఆ అమాయక యువకుడు తీవ్రవాద గ్రూపులో చేరిపోయాడనీ మరికొన్ని పత్రికలూ సానుభూతి కురిపించాయి. .
హైదర్ చిత్రంలో అతను నటించిన ప్రధాన పాత్రేం కాదు, కేవలం చాక్లెట్ బాయ్ కేరక్టర్. అమర్ సింగ్ కాలేజీలో బాంబు పేలుడు జరిగే సన్నివేశంలో సాకిబ్ నటించాడు. అందులో సాకిబ్ మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు. కేవలం 15 సెకన్లపాటు అందులో తాను కనిపిస్తాడు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)