ముస్లిం యువత తలుచుకుంటే ఈ దేశంలో హిందువులు తలదాచుకోవడానికి స్థలం దొరకదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముస్లిం మత పెద్ద, ఇత్తిహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్ పార్టీ (IMC) చీఫ్ అయిన మౌలానా తౌకీర్ తాజాగా ఓ జర్నలిస్టును బెదిరించాడు. న్యూస్ 18 ఇండియా యాంకర్ అమన్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా తీవ్ర పదజాలంతో హెచ్చరించాడు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా మొహం పగలకొడ్తా జాగ్రత్త అని హెచ్చరించాడు.
యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్టు తౌకీర్ ప్రకటించాడు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నారని న్యూస్ 18 యాంకర్ అమర్ చోప్రా అడగ్గా…..ఓ మహిళ అయిన ప్రియాంక వాద్రా బయటకు వచ్చి మహిళలకోసం పోరాడుతున్నారని…లడ్కీ హూన్, లడ్ సక్తీ హూం అని నినదిస్తూ వస్తున్న ఆమెకు సోదరుడిలా మద్దతుఇస్తున్నట్టు చెప్పారు. అయితే మౌలానా తౌకీర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన మరునాడే ఆయన కోడలు కాంగ్రెస్ పార్టీపై చాలా ఆరోపణలు చేసింది. మహిళాభ్యున్నతి విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదంది. ఇక మౌలానా వంటి వాళ్లతో పొత్తు పెట్టుకుందంటే మహిళల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిబద్దతపై సందేహం కలుగుతోందని అన్నారు. దానికీ తౌకీర్ దగ్గర సమాధానం లేకపోయింది.
ఇక ఇదే నెలలో హిందువులపై చేసిన విద్వేష వ్యాఖ్యలు, ప్రసంగాల గురించి అమన్ అడుగుతూ హిందువులకు వ్యతిరేకంగా పనిచేయడానికే కాంగ్రెస్ మద్దతు అవసరం అనుకున్నారా అని అడిగాడు. దానికీ నీళ్లునములుతూనే బదులిచ్చాడు. తాను ఆ కామెంట్ చేసింది ధర్మసంసద్ లో పాల్గొన్నవారి గురించి మాత్రమే అన్ననని… ముస్లింలను చంపుతుంటే చూస్తూ ఊరుకోబోమని…ముస్లిం యువత తలుచుకుంటే వాళ్లను నియంత్రించడం ఎవరివల్లా కాదని…అన్నాడని చెప్పుకొచ్చాడు. అయితే మధ్యలో కల్పించుకున్న అమన్….హిందువులు ఎవరు ఎవర్ని హత్య చేశారని…కమలేష్ తివారీ వంటి వాళ్లనే ముస్లింలు హత్యచేశారు కదా.. దాని గురించి ఎందుకు మాట్లాడరని అడిగారు. అసలైతే కమలేష్ తివారీని నిజంగా ఎవరు ఎందుకు చంపారో తౌకిర్ రజాకు, అమన్ చోప్రాకే కాదు అందరికీ తెలుసు. అయితే అమన్ ఈ ప్రశ్నకు రజా వింతగా మాట్లాడారు. బాంబు పేలుళ్లకు పాల్పడుతోందని ముస్లింలేనని నిందలువేస్తున్నారని అన్నారు. అంతటితో ఆగలేదు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది హిందువులేనంటూ మండిపడ్డాడు. ఉగ్రవాదులంటేనే ముస్లింలనీ అన్నారు. బాంబు పేలుళ్లకు పాల్పడింది ఎవరు ముస్లింలా అని అమన్ రెట్టించి అడగ్గా అవును మీరే…బాంబుపేలుళ్లు మీకే తెలుసనీ అన్నాడు. అలా ఎలా అంటారని …ఆధారాలేవని అమన్ రెట్టించడంతో బెదిరింపులకు దిగాడు రజా. “తమీజ్ సే బాత్ కరో వర్నా మూహ్ తోడ్ దేంగే” అంటే సరిగా మాట్లాడు..లేదంటే మొహం పగిలిపోతుంది అని హెచ్చరించాడు. ఏ మాత్రం జంకని అమన్… అంటే కమలేశ్ తివారీని చంపినట్టే నన్నూ చంపుతారా…బెదిరిస్తున్నారా అని అనడంతో…జనవరి 7 తాను మాట్లాడిన మాటల్లో తప్పుంటే తనపై ఎందుకు కేసు పెట్టలేదని తౌకీర్ వితండవాదానికి దిగాడు. కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసి ఉంటేపార్టీని ప్రశ్నలు అడగాలి తప్ప మద్దతిస్తున్న తననెందుకు అడుగుతున్నారని అన్నారు.
జనవరి 7న బరేలీలో 20 లక్షలమంది ముస్లింలు హాజరైన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ హిందువులపట్ల ద్వేషం పెంచేలా ముస్లింలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు తౌకీర్. ముస్లింలు తలుచుకుంటే హిందువులు తప్పించుకోలేరు..,తలదాచుకోవడానికి ఈ దేశంలో చోటే ఉండదని అన్నాడు.
Mullah who threatened Hindus with a cruder and scarier version of Enoch Powell’s infamous ‘rivers of blood’ speech, now threatens anchor on live TV.
Mullah is now a Congress ally.
Mullah says Batla House terrorists were martyred heroes.https://t.co/KHR5pCkuLw— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) January 20, 2022
మౌలానా ఇలా హిందువులపట్ల ద్వేషం ప్రదర్శిస్తూ రెచ్చగొట్టడం మొదటిసారి కాదు. సీఏఏ రద్దు చేయకపోతే దేశంలో రక్తపాతం జరుగుతుందన్నారు. స్వయంగా ప్రధానిని ఉద్దేశిస్తూ మేం చెప్పేది జరుగుతుంది… రక్తపాతం తప్పదు ఇన్షాల్లా అని హెచ్చిరించాడు. ఇక బాట్లా హౌస్ ఎన్ కౌంటర్లో హతమైన ఉగ్రవాదులను అమరవీరులుగా అభివర్ణించాడు. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ కేసుపై విచారణ జరిపిస్తామనీ హామీ ఇచ్చిందని…అది జరిగిఉంటే చనిపోయిన ఉగ్రవాదులకు అమరవీరుల హోదా దక్కేదని అన్నారు. అప్పుడు విచారణ జరపకుండా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మోసం చేసిందని..ఇప్పుడు కూడా అందుకే మద్దతిస్తున్నానని చెప్పాడు.