దేశవ్యాప్తంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు భారతదేశంలో ఇంజనీర్స్ డేగా గుర్తింపు పొందింది. ఇంజినీరింగ్ రంగంలో ఆయన చేసిన అద్భుత కృషి, నిపుణతను స్మరించుకుంటూ ఈ రోజున దేశంలోని విద్యాసంస్థలు, ఇంజనీర్ సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
……
1861లో మైసూర్ ప్రాంతంలోని ముద్దెనహళ్లి గ్రామంలో జన్మించారు . తన ప్రతిభతో రాజవంశ ఇంజనీర్‌గా ఎదిగి, మైసూర్ మహారాజు దగ్గర దివాన్‌గా సేవలందించారు.
కర్ణాటకలోని కృష్ణరాజ సాగర డ్యామ్ ఆయన ప్రతిభకు నిదర్శనం. వరద నియంత్రణకు ఆయన ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ స్లూయిస్ గేట్లు అప్పటి కాలంలో అద్భుతం.
హైదరాబాదు నగరంలో వరదల నివారణకు ముసి నది ప్రాజెక్టు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విశ్వేశ్వరయ్య పేరుతో అనేక ఇంజనీరింగ్ కళాశాలలు, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు పనిచేస్తున్నాయి. ఇంజనీర్ల సంఘాలు ఈ రోజున సదస్సులు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణాలలో విశ్వేశ్వరయ్య సూత్రాలను అనుసరించి అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
……….
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతంలో విశ్వేశ్వరయ్య భవన్ ఇంజనీర్లకు ముఖ్య కేంద్రమైంది. ఇక్కడ ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యాలయం ఉంది. ఇక్కడే ఇంజనీర్స్ డే సందర్భంగా సదస్సులు, అవార్డు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
……….
విశ్వేశ్వరయ్య క్రమశిక్షణ, శ్రమకు ప్రతీక. “క్రమశిక్షణ ఉంటేనే, ప్రగతి ఉంటుంది” అన్నది ఆయన నినాదం ఇంజనీరింగ్ విద్యార్థులు, యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి తీసుకోవాలి.