అలహాబాద్ హైకోర్టు అతనిపై దాఖలు అయిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి నిరాకరించడంతో, ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్, నకిలీ వార్తల పెడ్లర్ మహ్మద్ జుబైర్ తన ఫేస్బుక్ ఖాతాను తొలగించాడు.
హిందూ ధర్మకర్తలు, మహంత్ బజరంగ్ ముని ‘ఉదాసిన్’, యతి నర్సింహానంద్ సహా స్వామి ఆనంద్ స్వరూప్‌లపై అవమానకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు.. వారిని ద్వేషపూరితమైన వ్యక్తులుగా పేర్కొన్నందుకు ఉత్తర పోలీసులు జుబైర్‌పై కేసు నమోదు చేశారు.
జుబేర్ తరచుగా తన సోషల్ మీడియా ఖాతాలలో తప్పుడు వార్తలు, హిందూ దేవుళ్ళపై అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తుంటాడు.
గత సంవత్సరం జూన్‌లో జుబైర్ అబ్దుల్ సమద్ సఫీ కు సంబందించిన మ్యూట్ చేసిన వీడియోను ప్రసారం చేశాడు, జై శ్రీరామ్ అని నినాదాలు చేయనందుకు ఘజియాబాద్‌లో అతన్ని కొందరు కొట్టారని పేర్కొన్నాడు. తరువాత ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వ్యక్తిగత గొడవ అని వెల్లడించారు, పర్వేష్ గుర్జార్, ఆరిఫ్, ఆదిల్ సహా ముషాహిద్ లు సఫీని కొట్టారని పోలీసులు తేల్చేశారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో జుబైర్ ట్వీట్‌ను తొలగించాడు.
అంతకుముందు 2021 అక్టోబర్ లో జుబైర్ శివలింగాన్ని రోమ్ చర్చి కాంపౌండ్‌తో ఎగతాళి చేస్తూ..“వాటికా వాటికన్గా మారిందా? క్రీస్తు కృష్ణుడి నుంచి వచ్చాడా? ఇదంతా పాశ్చాత్యులచే పెద్ద దోపిడీయేనా?” అని రాసాడు. 2014లో ‘అన్ అఫీసియల్ సుబ్రమణియన్ స్వామి’ ఫేస్బుక్ పేజీని ప్రారంభించేందుకు ఆ పోస్టర్ తనను ప్రేరేపించిందని కూడా జుబైర్ చెప్పాడు.
గత నెలలో, జుబైర్ 85 సెకన్ల వీడియోను పోస్ట్ చేశాడు, అందులో అతను ముహమ్మద్ జీవితంపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించాడు. తన వీడియో వైరల్ కావడంతో నుపుర్‌కు హత్య, అత్యాచార బెదిరింపులు వస్తున్నాయి. అనేక మంది ఇస్లామిస్టులు భారతదేశంలో వీధుల్లోకి వచ్చి నిరసన పేరుతో విధ్వంసం సృష్టించారు. నిరసన సందర్భంగా ముస్లిం గుంపు రాళ్లు విసిరి.. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి.. భారత వ్యతిరేక నినాదాలు చేశారు.
జుబేర్ వక్రీకృత వీడియో నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి దారితీసింది. తరువాత బీజేపీ మాజీ అధికార ప్రతినిధి ముహమ్మద్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు, అయితే అది ఇస్లాంవాదుల నుంచి బెదిరింపులను ఆపలేదు. ఏఐఎంఐఎం (ఇంక్విలాబ్) నేత ఖావీ అబ్బాసీ నుపుర్ శర్మపై కోటి రూపాయల నజరానా ప్రకటించారు. తాలిబాన్ల శిక్షా విధానాన్ని ప్రతిబింబిస్తూ, కర్నాటకలోని బెలగావిలోని దర్గా దగ్గర నూపుర్ శర్మ దిష్టిబొమ్మ వేలాడుతూ కనిపించింది.