అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త ప్రయోగం చేశారు. ఆడపడుచులకు వినూత్నమైన ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆపరేట్ చేసే అవకాశం మహిళలకు కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అందుకు తగినట్లుగా ఆరుగురు మహిళలు మోడీ అధికారిక ఎక్స్ ఖాతాను హ్యాండిల్ చేశారు. “నా హృదయానికి దగ్గరగా ఉన్న ప్రధాన సమస్య- గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు. అవి ఆర్థికమైనవి కావచ్చు లేదా మౌలిక సదుపాయాలకు సంబంధించినవి కావచ్చు. అందుకే వాటిని వీలైనంతగా తగ్గించడానికి నేను గత 2 దశాబ్దాలుగా కృషి చేస్తున్నాను. నేను చాలా వరకు మార్పు తీసుకురాగలిగాను. అంతేకాదు చాలా మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించడం చూస్తూ నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను” అజైతా షా ట్వీట్ చేశారు.
డాక్టర్ అంజలీ అగర్వాల్ ప్రముఖ న్యాయవాది సమర్థ్యం సెంటర్ ఫర్ యూనివర్సల్ యాక్సెస్బిలిటీ వ్యవస్థాపకురాలు. ఆమె తన 3 దశాబ్దాల కెరీర్లో భారతదేశం అంతటా పాఠశాలలు, పబ్లిక్ ప్లేస్‌లను దివ్యాంగులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.
“ప్రతి స్త్రీ, ప్రతి వ్యక్తి, వారివారి జీవితాలను గౌరవంగా, స్వాతంత్ర్యంగా తీర్చుదిద్దుకోగలరని నిర్ధరణ చేసుకుందాం. దివ్యాంగుల జీవితాలను మెరుగుపరుద్దాం” అని ఆమె పిలుపిచ్చారు.
స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీలనూ మహిళలు రాణిస్తున్నారు. భారతీయ యువ శాస్త్రవేత్తలు ఎలీనా మిశ్రా, షిల్పీ సోనీలు మోదీ అకౌంట్ నుంచి పోస్టు చేశారు. న్యూక్లియర్ సైంటిస్టు ఎలీనా, స్పేస్ సైంటిస్టు సోనీ కూడా వుమెన్స్ డే సందర్భంగా పోస్టు చేశారు.
మొత్తం మీద మోదీ చేసిన ప్రయోగం సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది.