ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విజన్ అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఏమీ లేని చోట అద్భుతాలు చేయటమే మోదీ టీమ్ గొప్పతనం. భారత దేశం చుట్టూ 7వేల 5 వందల కిలోమీటర్ల మేర సాగర తీరం ఉంటుంది. ఈ సముద్రంలోంచి కోట్ల రూపాలయ విలువ చేసే సంపదను వెలికి తీయవచ్చు అన్నది మోదీ టీమ్ అంచనా. అందుచేతన సాగర గర్భం మీద పరిశోధనలు ముమ్మరం చేశారు. సముద్ర యాన్ అనే పేరుతో అద్బుతాలను సాకారం చేయబోతున్నారు.
……
సముద్ర గర్భంలోని మత్స్య సంపద, ఖనిజ సంపదను అన్వేషించేందుకు మరియు సముద్రాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సముద్రయాన్ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఈ మిషన్‌కు మొత్తం 4,077 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నారు. హిందూ మహా సముద్ర ప్రాంతాన్ని ఇప్పటికే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ చొరవ తీసుకొని.. మన భారత్‌కు అప్పగించింది. భారత్‌కు కేటాయించిన సముద్రగర్భంలో దాదాపు 75 వేల చదరపు కిలోమీటర్ల పరిధి ఉన్నది. ఈ ప్రాంతంలో నికెల్, రాగి, మాంగనీస్, కోబాల్ట్ వంటి ఖనిజాలతో కూడిన పీఎంఎన్లు విస్తరించి ఉన్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే మత్స్య సంపద ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ వివరాల్ని అన్వేషించటమే సముద్రయాన్ ప్రాజెక్ట్ లక్ష్యం.
…
ఇందులో భాగంగా సముద్ర గర్భంలోకి ఒక టీమ్ ను సబ్ మెర్సిబుల్ ద్వారా పంపిస్తారు. అక్కడ పరిస్థితులను ఫోటోలు, వీడియోల రూపంలో తీసుకొని వస్తారు. ఇందుకోసం ఒక పైలట్, ఒక కోపైలట్, మరో పరిశోధకుడు సముద్ర గర్భంలోకి వెళ్లనున్నారు. 12 గంటల పాటు ఈ ప్రయోగం కొనసాగనుంది. అత్యవసర పరిస్థితుల్లో 96 గంటల వరకు పొడిగించవచ్చు. 7,517 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉన్న భారత్‌కు ఈ ప్రయోగం చాలా కీలకంగా మారింది. అంతిమంగా సముద్రంలోపల వివరాలన్నీ శాస్త్రవేత్తలకు అందుబాటులోకి వస్తాయి.
….
సముద్రయాన్ కోసం దేశీయ సాంకేతికతతో మత్య్స 6000 పేరుతో ఒక సబ్ మెర్సిబుల్ ను అభివృద్ధి చేశారు. 28 టన్నుల బరువుండే ఈ సబ్‌మెర్సిబుల్‌కు రెండు రోబోటిక్ చేతులు ఉంటాయి. ఇవి సముద్రగర్భం నుంచి ఖనిజ నమూనాలను సేకరిస్తాయి. ఇందులో ప్రపంచంలోనే మొదటిసారిగా లీథియం పాలిమర్ బ్యాటరీలను వాడుతున్నారు. మదర్ షిప్ నుంచి దీనిని నియంత్రిస్తారు. ఒకవేళ నియంత్రణ కోల్పోయినా అత్యవసర పరిస్థితుల్లో ఇందులోని సిబ్బందిని రక్షించడానికి మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించారు.
….
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ టీమ్ చేస్తున్న అద్బుత ప్రయోగానికి అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. అందుచేతనే హిందూ మహా సముద్రంలోని 75 వేల చదరపు కిలోమీటర్ల పాగర ప్రాంతాన్ని భారత్ కు అప్పగించారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే కోట్ల రూపాయల విలువ చేసే సంపదను సృష్టించవచ్చు. అంతే కాదు, లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. అందచేతనే దీనిని మోదీ మార్కు మ్యాజిక్ అని పిలుచుకోవచ్చు.