ప్రధానిమోదీ హైదరాబాద్ పర్యటన రద్దైంది. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా జరిగే UNWGIC సమావేశాలకు మోదీ హాజరు కావల్సిఉంది. 120 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు ఆ కార్యక్రమంలో పాల్గొనన్నారు. అయితే మోదీ పర్యటన మాత్రం రద్దైంది. అయితే నేరుగా ఆయన వేదికను పంచుకోకున్నా.వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఆయన ప్రసంగించనున్నారు. కేసీఆర్ జాతీయపార్టీ ప్రకటన. మునుగోడు ఎన్నికల కోలాహలం నేపథ్యంలో మోజీ పర్యటన రాజీపడడం చర్చనీయాంశమైంది.ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యూత్ర కూడా తెలంగాణలో ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ రోజు మోదీ ఏం మాట్లాడతారన్నదీ చర్చనీయంశం అయింది. ఈ నేపథ్యంలో మోడీ ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది.