సింధూ ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్..
…….
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విసిరిన పంజా కు పాకిస్తాన్ ఇప్పుడు విల విల లాడుతోంది. సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకొంది. కాశ్మీర్ లో పర్యాటకుల మీద దాడి చేయటం ద్వారా పాకిస్థాన్ అన్ని హద్దులూ దాటేసింది. దీనిని తీవ్రంగా తీసుకొన్న మోదీ సర్కార్.. సంచలనమైన నిర్ణయం తీసుకొంది. ఇది పూర్తిగా అమలు లోకి వస్తే పాకిస్తాన్ సమాజం అల్లాడిపోవటం ఖాయం.
……..
సింధూ నది జలాల ఒప్పందానికి చాలా ప్రాధాన్యత ఉంది. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా సింధు జలాల్లో 30 శాతం భారత్ కు సంక్రమించగా, మిగిలిన 70 శాతం పాకిస్థాన్ కు హక్కు కలిగిస్తుంది. పాకిస్తాన్ సాగు భూమిలో 80%, దాదాపు 16 మిలియన్ హెక్టార్లు సింధు వ్యవస్థ నుండి వచ్చే నీటిపై ఆధారపడుతుంది.
ఈ నీటిలో 93% నీటిపారుదల కోసం ఉపయోగిస్తారు. ఇది దేశ వ్యవసాయ వెన్నెముక వంటిది.
..
అలాగే తాగు నీటి కోసం కూడా సింధూ నది చాలా ముఖ్యం. ఈ వ్యవస్థ 23.7 కోట్ల మందికి పైగా ప్రజలు ఆధారపడి ఉన్నారు. పాకిస్తాన్ సింధు బేసిన్ జనాభాలో 61% వాటా కలిగి ఉంది. ప్రధాన పట్టణ ప్రాంతాలైన కరాచీ, లాహోర్, ముల్తాన్ లకు ఈ నదుల నుండి నేరుగా నీరు లభ్యం అవుతుంది. ఇప్పుడు ఈ నీటి సరఫరా నిలిచిపోతే పాక్ ప్రజలు దాహంతో అల్లాడిపోయే ప్రమాదం ఉంది.
…..
అలాగే జల విద్యుత్ కు కూడా చాలా అవసరం టార్బెలా, మంగ్లా వంటి జలవిద్యుత్ కేంద్రాలు కూడా నిరంతరాయ ప్రవాహాలపై ఆధారపడి ఉంటాయి. ఈ వ్యవస్థ పాకిస్తాన్ జిడిపిలో దాదాపు 25% వాటాను అందిస్తుంది. గోధుమ, వరి, చెరకు, పత్తి వంటి పంటలకు మద్దతు ఇస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచంలో అత్యంత నీటి కొరత ఉన్న దేశాలలో ఒకటి. తలసరి లభ్యత వేగంగా తగ్గుతుంది. భారతదేశం సింధు, జీలం, చీనాబ్ నుండి ప్రవాహాలను నిలిపివేస్తే లేదా గణనీయంగా తగ్గిస్తే, ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
….
పట్టణ నీటి సరఫరాలు ఎండిపోతాయి, నగరాల్లో అశాంతి ఏర్పడుతుంది. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుంది, పరిశ్రమలు, గృహాలు స్తంభించిపోతాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణ ఎగవేతలు, నిరుద్యోగం, వలసలు పెరగవచ్చు. గతంలో యుద్ధాల సమయంలో ఈ ఒప్పందంను సమీక్షిస్తామని భారత్ బెదిరించినా, మొదటిసారి తీవ్రమైన చర్యకు పాల్పడింది.
..
పూర్తి స్తాయిలో ఇది అమలు అయితే పాకిస్థాన్ పరిస్థితి కుప్పకూలటం ఖాయం. సరిహద్దుల్లో తమాషాలు చేస్తున్న పాకిస్థాన్ కు మోదీ మార్కు పంజా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసి వస్తుంది.