నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ప్రధాని నరేంద్రమోదీ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో.. భూమిని ఆరోగ్యవంతంగా మార్చడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.
“మన ప్రాణాలను కాపాడటంలో, మన గ్రహాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తూ.. కష్టపడి పనిచేసే వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు” అని మోదీ ట్వీట్ చేసి, డాక్టర్లు పోషించిన పాత్రను ప్రశంసిస్తూ తన వాయిస్ ఓవర్‌తో వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
https://twitter.com/narendramodi/status/1542712243225526272?s=20&t=BKIu0ToBs4UGifYfOpp4UQ
ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ గౌరవార్థం వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, ఆయన జయంతి, అలగే వర్ధంతి రెండూ జూలై 1న వస్తాయి.