బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా ఆయనింటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. దేశం కోసం ఆయన చేసిన సేవలు అమోఘమని ఆయన దూరదృష్టి, మేథస్సు అపూర్వమని కొనియాడారు మోదీ. బీజేపీ స్థాపన, పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎనలేనిదని మోదీ అన్నారు. ఆయన నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు మోదీ. ఇంకా మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు ఆద్వానీ ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/narendramodi/status/1589870978892705794?s=20&t=a58OCLu9KwhGAQ65SjFfrQ