భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం అమెరికా బయల్దేరి వెళ్తున్నారు. ఐదురోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ప్రెసిడెంట్ బైడెన్ తో ఆయన సమావేశం ఉంటుంది. QUAD సమావేశంలోనూ, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలోనూ ప్రధాని పాల్గొంటారు. బైడెన్ నేతృత్వంలో జరిగే కోవిడ్-19 ప్రపంచ సదస్సులోనూ పాల్గొంటారు. తరువాత అమెరికా అధ్యక్షుడితో ముఖాముఖి సమావేశం ఉంటుంది. మోదీ వెంట విదేశీ మంత్రిత్వ శాఖ ,జాతీయ భద్రతా మండలితో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికా వెళ్తోంది.