భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని పుమియో కిషిదకు ఆత్మీయ స్వాగతం పలికారు ప్రధానిమోదీ. భారతీయ వంటకాలను దగ్గరుండి మరీ తినిపించారు. ఇక భారత్ స్ట్రీట్ ఫుడ్ లో చాలామంది ఇష్టపడే పానీపూరీని మోదీ ఆయనకు రుచిచూపించగా…ఎంతో బాగుందంటూ మరీమరీ తిన్నారు. ఇరుదేశాల సాంస్కృతిక బంధంపై చర్చించేందుకు మోదీ, కిషిద ఢిల్లీలోని బుద్ధజయంతి పార్కుకు వెళ్లారు.చర్చలు అయ్యాక పార్క్ అంతా తిరుగుతూ అక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్ స్టాళ్ల దగ్గరకెళ్లారు. రకరకాల వంటకాలు, పానీయాలను రుచి చూశారు. ఇక పానీపూరిని తినమని మోదీ ఆఫర్ చేయగా ఇష్టంగా ఆరగించారు జపాన్ ప్రధాని. అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. మోదీ కూడా తన ట్విట్టర్లో షేర్ చేశారు.
https://twitter.com/narendramodi/status/1637828369424211968?s=20